`గుంటూరోడు` TJ రివ్యూ

సినిమా :         గుంటూరోడు

పంచ్ లైన్ :    `గుంటూరోడు`..ప‌క్కా ఊర మాస్ .

నిర్మాణ సంస్థ : క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నటీనటులు :  మంచు మనోజ్‌.. ప్రగ్యాజైశ్వాల్‌.. సంపత్‌.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌ తదితరులు

సంగీతం :        డి.జె. వసంత్‌

ఛాయాగ్ర‌హ‌ణం : సిద్ధార్థ్ రామ‌స్వామి

కూర్పు:         కార్తీక్‌ శ్రీనివాస్‌

నిర్మాత:        శ్రీ వ‌రుణ్ అట్లూరి

కథ, కథనం, మాటలు, దర్శకత్వం : ఎస్‌.కె. సత్య

మోహ‌న్‌బాబు త‌న‌యుడుగా తెరంగేట్రం చేసిన మంచు మ‌నోజ్ సినీ కెరీర్‌లో ప‌దేళ్ళ ప్ర‌స్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు.డిఫ‌రెంట్ క‌థ‌లు, క్యారెక్ట‌ర్స్‌తో త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేసిన మ‌నోజ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఫక్తు మాస్‌ కథతో మాత్రం సినిమా చేయలేదు.పూరీ జగన్నాథ్‌ శిష్యుడైన ఎస్‌.కె. సత్య  మాస్‌ మసాలా అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రచార చిత్రాలతోపాటు, చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారనే కబురుతో విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిందీ సినిమా. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఉందా? సరైన విజయం లేక సతమతమవుతున్న మనోజ్‌కి ‘గుంటూరోడు’తో వూరట కలిగినట్టేనా? తదితర విషయాలు తెలియాలంటే మ‌రి ఈ `గుంటూరోడు` చిత్రం మ‌నోజ్‌కు ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చిందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ:

సూర్య‌నారాయ‌ణ‌రావు(రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కు త‌న కొడుకు క‌న్నా(మంచు మ‌నోజ్‌) అంటే ప్రాణం.కన్నా(మంచు మనోజ్‌) వూళ్లొ అందరితోనూ గొడవలు పడుతున్నాడని, అతడికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు తండ్రి సూర్యనారాయణ(రాజేంద్ర ప్రసాద్‌).పెళ్ళిచూపుల‌కు వెళ్ళినా క‌న్నా, అక్కడ పెళ్ళి కూత‌రు స్నేహితురాలు అమృత‌(ప్ర‌గ్యా జైశ్వాల్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు.ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే స‌మ‌యంలోఎమ్మెల్యే కావాలనుకున్న క్రిమినల్‌ లాయర్‌ శేషు(సంపత్‌రాజ్‌) చెల్లెలు అమృత.శేషుకు ఈగో ఎక్కువ‌,అహంకారి అయిన శేషుతో అనుకోకుండా కన్నాకి శత్రుత్వం ఏర్పడుతుంది.ఈలోపు క‌న్నా, అమృత‌ల ప్రేమ వ్య‌వ‌హారం శేషుకు తెలుస్తుంది.తనకు శత్రువైన కన్నాకి శేషు చెల్లిల్ని ఇచ్చి పెళ్లి చేశాడా? శేషు ఎమ్మెల్యే అయ్యాడా?.. తదితర విషయాలను తెరపైనే చూడాలి.

విశ్లేష‌ణ:

సగటు కమర్షియల్‌ సినిమా ఇది. కథా కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. పాటలు, పోరాటాలు, లవ్‌ట్రాక్‌, హీరో-విలన్‌ మధ్య శత్రుత్వం వంటి అంశాలతో ఒక ఫార్ములా ప్రకారం సినిమా సాగిపోతుంది.కన్నా బాల్యాన్ని పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో  సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ మామూలే.మంచు మ‌నోజ్ త‌న ఎన‌ర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. డ్యాన్సులు, ఫైట్స్ విష‌యంలోనే కాదు, క్యారెక్ట‌ర్‌ను క్యారీ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టి యూత్‌ను ప్రేమ విష‌యంలో ఎలా ఉన్నారు, త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య‌లు వ‌స్తే ఎలా రియాక్ట్ అవుతార‌నే దానికి సంబంధించి మంచి బాడీ లాంగ్వేజ్‌ను క‌న‌ప‌రిచాడు మ‌నోజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నోజ్ చేయ‌న‌టువంటి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా మూవీ ఇది. పాత్ర ప‌రంగా మ‌నోజ్ యాక్టింగ్ కూడా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ ప‌గ్ర్యా జైశ్వాల్‌, త‌న పాత్ర‌కు న్యాయం చేసింది.ఇక విల‌న్‌గా న‌టించిన సంప‌త్ పాత్ర చాలా కొత్తగా ఉంది.అహంకారం, పొగరు ఉన్న క్రిమినల్‌ పాత్రలో సంపత్‌ నటన పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మ‌నోజ్ తండ్రి పాత్ర‌లో న‌టించిన రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌న పాత్ర‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ న్యాయం చేశారు.కోట శ్రీనివాసరావు తలపండిన రాజకీయ నాయకుడిగా తన పాత్ర పరిధి మేరకు నటించారు. రావు ర‌మేష్‌, కాశీవిశ్వ‌నాథ్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. పృథ్వీ, ప్రవీణ్‌, సత్య తదితర కామెడీ గ్యాంగ్‌ ఉన్నా.. పెద్దగా నవ్వించలేకపోయారు. వాళ్ల పాత్రలు తేలిపోయాయి.

ఇక సాంకేతికంగా చూస్తే.. ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య మ‌నోజ్‌ను మాస్ హీరోగా చూపించే ప్ర‌య‌త్నం బాగానే ఉంది.దర్శకుడు ఎస్‌.కె. సత్య మాటలు, దర్శకత్వ తీరు అన్ని సర్వసాధారణంగానే అనిపిస్తాయి. సిద్ధార్థ్ రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బావుంది.మ్యూజిక్ డైరెక్ట‌ర్ డిజె.వ‌సంత్ అందించిన ట్యూన్స్ బావున్నాయి.నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్:

*  నటీనటులు

*  సినిమాటోగ్ర‌ఫీ

* నిర్మాణ విలువలు

* సంగీతం

మైన‌స్ పాయింట్స్:

*  రొటీన్ మాస్ స్టోరీ

* కామెడీ లేక‌పోవ‌డం

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

* క్లైమాక్స్

రేటింగ్: 3 / 5