గూడు కోసం ఎదురుచూపులు

పేద ప్రజలకు ఓ గూడు కల్పంచాలనే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా మొదటి విడతలో సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్ళ నిర్మాణం చేసి… పేద ప్రజలకు అందించారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాదిలో లక్ష ఇళ్ళ నిర్మాంచాలని … ప్రభుత్వం భావించింది.ఒక్కో ఇంటిపై ఏడున్నర లక్షలు ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అంటే ఒక్కో నియోజకవర్గం లో 4 వేల 166 ఇళ్ళు నిర్మించనున్నారు. జిల్లా మంత్రి చైర్మన్ గా , కలెక్టర్ కన్వీనర్ గా… స్దానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యులుగా ఏర్పాటు చేసిన కమిటీయే.. ప్రతి నియోజకవర్గంలో డివిజన్ వారిగా మీటింగ్ పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆశతో జనాలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా లో ఇప్పటి వరకు 3 లక్షల 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే … హైదరాబాద్ జిల్లా తో పాటు… రంగారెడ్డి జిల్లా అర్బన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభుత్వం జీహెచ్ఎంసీ కి అప్పగించింది.ఇప్పటి వరకు ఎక్కడ కూడా జీహెచ్ఎంసీ దరఖాస్తుల వెర్పీకేషన్ కూడా చేయలేదు.ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు దరఖాస్తులు పరిస్దితి తయారు అయ్యింది. రంగారెడ్డి జిల్లా లోని రూరల్ ప్రాంతంలో నియోజిక వర్గానికి 400 ఇళ్ల నిర్మాణం చేసేందుకు టెండర్లను కూడా పిలిచారు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని… అప్పటి వరకు ఎదురు చూడలేక కొంత మంది డబ్బులు పెట్టి జేఎన్నేఆర్ఎం ఇళ్ళను తీసుకుకొవడానికి వస్తున్నారు. మొత్తం మీద ఇళ్ళ నిర్మాణం లో అధికారుల అలసత్వంతో…. డబుల్ బెడ్ రూమ్ కోసం జనాల ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు.