గ్యారేజ్ జోరుకి బాబు బ్రేకులు

అవసరమైనప్పుడు ఆహా..ఓహో అన్నారు..రాష్ట్రం మొత్తం ప్రచారానికి తిప్పి తిప్పి వాడుకున్నారు.. ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ పై వున్నా అక్కడినుండి ప్రచారం చేయించారు.ఇప్పుడు అవసరం తీరిపోయింది.. ఇంకేముంది అడుగడుగునా ఆటంకాలు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి..ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనని.

ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది.బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ ఒక్క జనతా గ్యారేజ్ కి తప్ప వేరే ఏ సినిమాకు రాలేదన్నది వాస్తవం.అంతటి క్రేజ్ తో ఎన్టీఆర్ సినిమా విడులయితే..ఒకవేళ అభిమానుల అంచనాల్ని అందుకుంటే..ఎన్టీఆర్ కి మాములు హిట్ పడదు..ఒక్క దెబ్బతో ఎన్టీఆర్ స్టార్ డం శిఖరాగ్రానికి చేరడం ఖాయం.

ఇక్కడే పచ్చ బాస్ కి కన్నుకుట్టినట్టుంది.అందులోను పవన్ కళ్యాణ్ టీడీపీ తో దోస్తానా దగ్గరినుండి ఎన్టీఆర్ ని పక్కన పడేసారు బాబుగారు.అయినా ఎన్టీఆర్ బాబు బాబు అంటూ యాచించలేదనే అక్కసు తో వీలున్నప్పుడల్లా ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతూనే వున్నారు.ఎన్టీఆర్ సినిమాల విడుదల విషయం లో నందమూరి అభిమానులమంటూ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మొబైల్ మెసేజీ లు పంపడం,మరో వైపు హరి కృష్ణని దాదాపు పార్టీ కి దూరం పెట్టేసారు.వీటన్నిటిని ఎన్టీఆర్ తప్పిదాలుగా వండి వార్చడానికి పచ్చ మీడియా ఉండనే వుంది.

ఇక తాజాగా జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో ల విషయం లో ఆంధ్రప్రదేశ్ లోని అభిమానులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకున్నారు.ఇక ఒక్క విజయవాడ లోనే గ్యారేజ్ బెనిఫిట్ షో రైట్స్ ని 25 లక్షలకు కొన్నట్టు సమాచారం.ముందుగా రెవిన్యూ అధికారుల అనుమతితోనే బెనిఫ్ట్ షో లకి రైట్స్ తీసుకుని రేపు అర్ధ రాత్రి ప్లాన్ చేసుకున్నారు.

తీరా అప్రూవల్ కోసం వెళ్తే తాపీగా కుదరదు,బెనిఫిట్ షో లు వద్దంటూ జీవో వుంది అంటూ అధికారులు సమాధానమివ్వడం తో బయర్స్ షాక్ తిన్నారు.అందరి సినిమాలకు బెనిఫిట్ షో లు ఏ అడ్డు లేకుండా నడుస్తుంటాయి.అయితే ఎన్టీఆర్ సినిమా అందులోనూ ఇన్ని అంచనాల మధ్య వస్తోన్న సినిమా తెల్లారే సరికే పాజిటివ్ టాక్ వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అన్న కక్ష సాధింపుతోనే పచ్చ పార్టీ ఇంతటి దారుణానికి తెరతీసింది సినీ పండితులే వ్యాఖ్యానిస్తున్నారు.