గ్యారేజ్ పై ఎందుకంత కాన్ఫిడెన్స్

జనతా గ్యారేజ్.. ఈ టైటిల్ జనాలకు బాగా ఎక్కేసింది. అసలు సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక కారణాలు చెప్పేసాడు డైరెక్టర్ కొరటాల శివ. 1980 వ. దశకం లో ఈ పేరుని బాగా వాడేవారట. జనతా ఖాదీ, జనతా టైలర్, ఇలాంటి పేర్లు ఇంక్కా చాల వాటికీ వాడేవారట. అంతే కాదు జనతా ధియేటర్ అని కూడా ఎక్కడో చూశారట.

జనత అంటే జనం అని ఆయనకథ జనానికి సంబంధించిందే కాబట్టి ఆ పేరు పెట్టాను. కథ రాసుకున్నప్పుడే ఈ టైటిల్‌కు ఫిక్సయ్యా’’ అని కొరటాల చెప్పుకొచ్చాడు. మిర్చి సినిమా హిట్ అయ్యాక అంతకన్నా గొప్ప కధ రాయాలని శ్రీమంతుడు రాసాడట,ఇప్పుడు శ్రీమంతుడు కన్నా స్ట్రాంగ్ సబ్జెక్టు తో జనతా గ్యారేజ్ రాసానని అన్నారు కొరటాల.

వ్యక్తిగతంగా కొరటాలకు ఎన్టీఆర్ తో మంచి స్నేహమే ఉన్నదట అందుకనే ఎన్టీఆర్ తో సినిమా అనగానే మొదట బయపడ్డారట. సినిమా ఫలితాలవల్ల వ్యక్తిగత బంధాలు దెబ్బతినకూడదన్న ఆందోళనతో కథను పటిష్ఠంగా రాశానని చెప్పాడు. జనతా గ్యారేజ్ సినిమా అయిపోయాక ఆ ఆందోళన లేదన్నాడు. ఇక, సినిమాను హిట్టో, సూపర్ హిట్టో, హ్యాట్రిక్ హిట్టో సినిమా చూసిన ప్రేక్షకులే చెప్పాలని అన్నాడు.