చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడే బీజేపీ పెద్ద స్కెచ్ వేసినట్టు కనిపిస్తుంది. స్పెషల్ స్టేటస్ ఇస్తామని అప్పుడు నమ్మబలికి, ఇప్పుడు ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పడు ప్యాకేజి అంటూ తప్పించుకునే పనిలో నిమగ్నమయ్యింది. అంతే కాకుండా దానిలో చంద్రబాబుని కూడా ఇరికించే ఎత్తుగవ వేసినట్టు కనిపిస్తుంది. ఆ ఆలోచనతోనే చంద్రబాబుని ఢిల్లీకి రప్పించి ఆయన సమక్షం లోనే హోదా లేదని చెప్పి ప్యాకేజ్ ని ప్రకటించి భవిష్యత్తులో ఎవరయినా బీజేపీ హోదా ఇవ్వలేదు అంటే చంద్రబాబు అనుకూలతతోనే ప్యాకేజి ఇచ్చాము అని చెప్పుకోవచ్చని భావిస్తుంది. ఆంధ్ర చాణుక్యుడు బీజేపీ ఎత్తుగడని ఎదుర్కొంటాడా లేక ఇరుక్కుంటాడో చూదాం..