చలో అమరావతి-అన్నీ కన్నీటి గాధలే

ఊద్యోగుల తరలింపు ప్రక్రియ భావోద్వేగాల మధ్య ప్రారంభం అయింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడిన ఊద్యొగులు అమరావతికి వెళ్లాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జీవన శైలిలో భాగమైన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా తమ కుటుంబ సభ్యులు, బందువులను వదిలి అమరావతికి వెళ్లాల్సి రావడంతో తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నామన్న సంతోషం కన్నా ఇన్నేళ్లుగా కలిసి ఊన్న మహనగరాన్ని వదిలి వెళ్తున్నామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

తరలింపు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో, ఏపి హెచ్ ఓ డి లు ఒక్కొక్కటిగా అమరావతికి తరలివెళ్తున్నాయి. ఇప్పటికే దాదాపు 10 కార్యాలయాలు ఏపికి మకాం మార్చాయి… రానున్నమూడు రోజుల్లో తరలింపు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అటు ఎన్నో ఏళ్లుగా హైదరబాద్ లో స్థిరపడిన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా అమరావతికి వెళ్లలాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇది ఇలా ఉంటే, ఏపి కి తరలుతోన్న ఉద్యోగులు ఉద్వేగానికి గురవుతున్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తూ, కుటుంబ సమేతంగా నగరంలోనే స్థిరపడిన తాము , అకస్మాత్తుగా విజయవాడకు తరలాల్సి రావడం బాధగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రాంతానికి వెళ్తున్నామన్న సంతోషం ఓ వైపు, ఇంత కాలం కలసి పనిచేసిన తోటి తెలంగాణ ఉద్యోగులను, బందువులను, ఆత్మీయులను వదిలి వెళ్తున్నామన్న వ్యధ తమను వేదిస్తోందని అంటున్నారు. అటు ఏపి కి అలాట్ అయిన తెలంగాణ ఉద్యోగులకు మరో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వారమే అయినా, ఉద్యోగుల విభజనతో ఏపి కి తరలి రావడం వింతగా ఉందని వాపోతున్నారు.

ఈ నెల 27 లోపు హెచ్ఓడి లు కృష్ణా-గుంటూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లోకి తరలాల్సిందేనన్న ప్రభుత్వ సర్క్యూలర్ అనుగుణంగా..కార్యాలయాల తరలింపు వేగం పుంజుకుంది. ఇప్పటికే మార్కెటింగ్-సహకార శాఖ అనుబంధ సంస్థలు -మౌళి సదుపాయాలు-కార్మిక కమిషనరేట్ ..తదితర కార్యాలయాలు రెండు జిల్లాల పరిధిలో భవనాలను అద్దెకు తీసుకున్నాయి.

తాజాగా వ్యవసాయ కమిషనరేట్, సమాచార శాఖ కార్యాలయాలు..కంప్యూటర్లు-ఫైళ్లు-ఫర్నీచర్ ను విజయవాడకు తరలించాయి…. వ్యవసాయ కమిషనరేట్ ఉన్న సుమారు 100 మంది ఉద్యోగులు రెండు బస్సుల్లో ఏపికి తరలి వెళ్లగా, మరికొందరు రెండు-ముడు రోజుల్లో విజయవాడకు చేరుకోనున్నారు. అటు సమాచార శాఖలో ఉన్న 77 రెగ్యులర్ ఉద్యోగులు ఇవాళ ఉదయం రెండు బస్సుల్లో విజయవాడకు చేరుకోనున్నారు. మరోవైపు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో విభాగాల అధిపతులు..తరలింపు ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. సచివాలయ సీఎస్ కార్యాలయం కంట్రోల్ రూంగా ఏ ఏ కార్యాలయాలు ఎక్కడికి వెళ్తున్నాయనే దానిపై హెచ్ ఓ డి లు సమాచారం ఇస్తున్నారు.
ఇక స‌హ‌కార శాఖ ఉద్యోగులు కూడా అమ‌రావ‌తికి బ‌య‌లు దేరారు. గుంటూరు లో శ్యామ‌ల రావు న‌గ‌ర్ లో వీరు కొత్త కార్యాల‌యం తీసుకున్నారు..ఈ శాఖ‌లో మొత్తం ఉద్యోగులంతా ఇప్ప‌టికే సామాగ్రిని త‌ర‌లించారు.కొన్ని ముఖ్య‌మైన ఫైళ్లు, ఇత‌ర డాక్యుమెంట్ల‌తో ప్ర‌త్యేక బ‌స్సు బ‌య‌లు దేరింది..దీంతో పాటు స‌హ‌కార శాఖ ఉద్యోగులంతా రెండు బ‌స్సుల్లో అమ‌రావ‌తికి బ‌య‌లు దేరారు….హైదరాబాద్ ను వ‌ద‌లి వెళ్ల‌డం బాధాక‌ర‌మే అయినా త‌ప్ప‌దంటున్నారు….అమ‌రావ‌తి అభివృద్దిలో భాగ‌స్వామ్యం అవుతామంటున్నారు.

ప్రభుత్వ శాఖలన్నీ ఒక్కొక్కటిగా రాజధానికి చేరుకుంటున్నాయి.. ప్రత్యేక బస్సుల్లో సచివాలయ ఉద్యోగులు అమరావతికి బయలుదేరారు. కాగా వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌ని చేస్తున్న ఓ ఉద్యోగిని మాత్రం త‌మ రాజ‌ధానిలో ప‌ని చేసేందుకు హైద‌రాబాద్‌కు గుడ్ బై చెపుతూ అమ‌రావ‌తికి సైకిల్ మీద రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌నిచేస్తున్న ప‌ద్మిని త‌న సొంత రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నిచేసేందుకు, ప్ర‌భుత్వానికి త‌న సేవ‌లందించేందుకు మిగిలిన ఉద్యోగుల్లా కాకుండా హైద‌రాబాద్‌కు బై చెప్పి అమ‌రావ‌తికి సైకిల్ మీద బయల్దేరారు..ఈ ఉదయం ఏపి ఎన్జీవో నేత అశోక్ బాబు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య జెండా ఉపి ఈ యాత్రను ప్రారంభించారు.

కార్యాల‌యాల త‌ర‌లింపు అంశంపై డెడ్ లైన్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో సీఎస్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు…ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌నితీరు ఎన్ని శాఖ‌ల‌కు బిల్డింగ్స్ అందుబాటులోకి వ‌చ్చాయ‌నే దానిపై చ‌ర్చించారు….కొన్ని హెచ్ వోడీలు త‌మ‌కు దొరికిన కార్యాల‌యాల‌పై కొంత అసంత్రుప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు అధికారులు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. వాటికోసం ప్ర‌త్యేకంగా కార్యాల‌యాలు తీసుకోవాల‌ని సీఎస్ సూచించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ షిప్టింగ్ ప‌నులు మొద‌లు కావాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు. ముందుగా కొన్ని శాఖ‌ల్లో క‌ద‌లిక వ‌స్తే త‌ర్వాత మ‌రికొన్ని త‌ర‌లి వెళ‌తాయ‌నే అభిప్రాయాన్ని సీఎస్ వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

మ‌హిళా ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎస్ సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన మార్గ‌ద‌ర్శకాల్లో మ‌హిళా ఉద్యోగుల‌కు హాస్టల్ సౌక‌ర్యం పై పొందు ప‌ర్చారు. దీంతో హాస్ట‌ళ్ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని సీఎస్ సూచించారు. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డ‌కుండా హోం శాఖ అధికారులు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల‌ని కూడా సూచించారు.

ఇక ఐఎఎస్ అధికారుల కోసం రెయిన్ ట్రీ అపార్ట్ మెంట్ల‌లో వ‌స‌తి సౌక‌ర్యం ఏర్పాటు చేయాల‌ని సూచించారు..కుటుంబంతో వ‌చ్చే అధికారులకు అలాగే బ్యాచిల‌ర్ అకామిడేష‌న్ కావాల‌నుకునే వారికి వేరు వేరుగా వ‌స‌తి క‌ల్పించాల‌ని సూచించారు..ఇప్ప‌టి వ‌ర‌కు షిప్టింగ్ లో వ‌చ్చిన పురోగ‌తిపై సీఎస్ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు…ఇంకా కేవ‌లం రోజులు మాత్ర‌మే ఉండ‌డంతో సీఎస్ నిర్వ‌హించిన స‌మావేశానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది…సీఎం కూడా తరలింపు ప్రక్రియ వేగవతం పై దృష్టి సారించడంతో ఆధికారులు సైతం సధ్యమైనంత త్వరగా శాఖలను తరలించాల్ని ప్రయత్నిస్తుంది