చిరు,గంటా మళ్ళీ దోస్తీ అందుకేనా?

చిరంజీవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాన్నిహిత్యం ఈనాటిది కాదు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినదగ్గరినుండి గంటా తో చిరుకి మంచి అనుబంధం ఉంది.అయితే ఆ తదనంతర పరిణామాల్లో చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడం తో గంటా కాంగ్రెస్ లో మంత్రి పదవి కొట్టేశారు.ఇక 2014 లో వ్యూహాత్మకంగా టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రయ్యారు.చిరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.

తాజాగా గంటా కొడుకు రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది.ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించనున్నాడు.చిరుతో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్.. పవన్ తో తీన్ మార్ చేసిన జయంత్ సి పరాన్జీ మెగాస్టార్ తో మంచి అనుబంధం ఉంది.అందుకే చిరు గంటా వారసుడి తెరంగ్రేటం కు జయంత్ ని సూచించాడని సమాచారం.

అయితే కావు ఉద్యమమా ఉవ్వెత్తున లేచి పడిన ఈ సందర్భంలో కాపు కమ్యూనిటీకి చెందిన గంటా చిరుల స్నేహం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.ఇప్పటికే కాపులంతా ఐక్యం కావాలన్న నినాదం మిన్నంటుతోండడం చూస్తుంటే ఈ తాజా కలయిక ఆసక్తి కరంగా మారింది.కాపులంతా కలిసి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేనని కలుపుకొని సొంతంగా పోటీచేసే ఆలోచనలో ఉన్నట్టు పుకార్లు కూడా విన్పిస్తున్నాయి.అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు.