చిరు గురించి చెప్పిన బాలయ్య

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా కొన్ని చానెల్స్ బాలయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లో బాలయ్య చాల ఆసక్తికర విషయాలు చెప్పారు.

బాలయ్యకు కోపమెక్కువ అని అంటుంటారు దీనికి మీరు ఏకీభవిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా తనకు కోపమెక్కువ అని అనుకుంటూవుంటారని అయితే అది నిజం కాదని తాను అందరితో చాలా సరదాగా ఉంటానని ప్రజలతో చాల త్వరగా కలిసిపోతానని చెప్పి ఇంట్లో కూడా పిల్లలతో సరదాగానే ఉంటానని తన సినిమాల గురించి కుటుంబ సభ్యులు వారి అభిప్రాయాలని  నిర్మొహమాటంగా తనకు చెపుతారని కూడాబాలయ్య చెప్పారు.

అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాగురించి కూడా చెప్పారని సినిమాలో ఒక్క నెగటివ్ పాయింట్ కూడా లేదని వారు చెప్పటం తనకు చాల ఆనందం కలిగించిందని చెప్పారు బాలయ్య. ఇంకా తాను MLA గాను, హాస్పిటల్ బాధ్యతలతో బిజీగా ఉండటం వలన మరియు సినిమా ఇండస్ట్రీలో చాల తక్కువమంది ఫ్రెండ్స్ వున్నారని తనకు అత్యంత సన్నిహితంగా వుండే స్నేహితుడు చిరంజీవి అని చెప్పాడు బాలయ్య.