చిరు రౌడీ అల్లుడికి పాతికేళ్ళు

మెగాస్టార్ చిరంజీవి హీరో గా కే. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రౌడీ అల్లుడు సినిమా 18 అక్టోబర్ 1991 సంవత్స్రం లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయినా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలయ్యింది . మెగాస్టార్ గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా రౌడీ అల్లుడు.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ ఈ ‘రౌడీ అల్లుడు’. ఈ సినిమా లో మెగాస్టార్ ద్విపాత్రాభియ తో మెప్పించాడు. ఈ సినీమా లో ఆటో జానీ గా మెగాస్టార్ నటనకి హోల్ ఆంధ్రా ఫిదా అయిపోయింది. చిరంజీవికి నటనలో వుండే ఈజ్ ని ఆ పాత్ర కళ్ళకు కట్టినట్టు చూపుతుంది.

ఇక ఈ సినిమా డైలాగ్స్ విషయానికొస్తే “వీడెవడండీ బాబూ ..” అంటూ కోట,`బొంబైలో అంతే, బొంబైలో అంతే` అంటూ అల్లు నవ్వుల్తో ముంచెత్తుతూ భయంకరమైన విలనీతో అద్బుత‌మైన పెర్ఫామెన్స్ చేశారు. `భగవంతుడు అంతే బాబు అప్పుడప్పుడూ `కమాల్` చేస్తూ ఉంటాడు` అంటూ వచ్చి రాని హిందీలో అల్లు మాట్లాడటం. ‘ఆల్ ది బెస్ట్ ఆఫ్ లకింగ్స్’, ‘నో టచింగ్స్’, ‘సిట్టింగ్స్’, ‘స్టాన్డింగ్స్’ అంటూ వచ్చీ రాని ఇంగ్లీష్ లో జానీ సంభాషణలు సినిమాకు బలమైన బలం !! ‘బాక్సులు బద్దలైపోతాయి’ అనే డైలాగ్ స్టేట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.

ఈ సినిమా లో బప్పీలహరి మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ‘చిలుకా క్షేమమా’ అంటూ మొదటి పాటగా వచ్చే డ్యూయెట్ సూపర్ హిట్ సాంగ్, జానీ పాత్ర ఎంట్రీ కాగానే డిస్కోశాంతితో వచ్చే ‘అమలాపురం బుల్లోడా .. నీ బొంబై చూడాలా’ అనే సాంగ్ మాస్ పాటల్లో నేటికీ, ఎప్పటికి గుర్తుండిపోయే పాటే.