‘చెప్పను బ్రదర్’ కి కౌంటర్ అరవండి బ్రదర్

మెగా హీరోల సినిమా ఫంక్షన్ అయినా,ఫామిలీ ఫంక్షన్ అయినా అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోతే అభిమానులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించేస్తున్నారు.అయితే ఈ అభిమానం అప్పుడప్పుడు మెగా ఫామిలీ వాళ్ళకే ఇబ్బంది కలిగిస్తోంది.

ఆ మధ్యన మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా ఈ విషయం పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.తాజాగా అల్లు అర్జున్ కూడా అభిమానులపై అసహనం వ్యక్తం చేసాడు.పవన్ గురించి మాట్లాడమన్న ఓ అభ్యర్ధనకు ‘చెప్పను బ్రదర్’ అని రెస్పాండ్‌ అయ్యారు.అలా ‘చెప్పను బ్రదర్’ అనేది చాల పాపులర్ అయిపొయింది.మరో వేడుకలో అదే అల్లు అర్జున్ గమ్మునుండవోయ్ అంటూ చమత్కరించడం కూడా ఈ కోవలోనిదే.

అయితే లేటెస్ట్ గా సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ ఆడియో రిలీజ్‌లోనూ ఫ్యాన్స్ పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేశారు. వీటన్నింటీ సాయి చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు.అంతేనా అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటే సాయి మాత్రం రివర్స్ లో “‘అరవండి బ్రదర్’ మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పవర్ స్టార్ అనే చెబుతా అంటూ సాయి అభిమానులతో వ్యాఖ్యానించారు. మీ ప్రేమను నేను ‘ఆపలేను బ్రదర్’ అని అన్నారు. అంతేకాక, అరవండి.. ఇంకా అరవండి.. మీతో పాటు నేనూ అరుస్తా అంటూ పవర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్” అని నినదించారు.

దీంతో మొత్తం ఇండస్ట్రీ లో మెగా వార్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది.మెగా హీరోలు ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపక పోతే విషయం ఎక్కడికెళ్తుందో అని మెగా అభిమానులే ఆందోళన చెందుతున్నారు.అన్నిటికి కేంద్రబిందువవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే అభిమానుల మధ్య ఏర్పడ్డ ఈ అగాధాన్ని మొగ్గలోనే తుంచేస్తే మంచిది.