జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త

ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌న‌.. క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అలాగే ఆయ‌న‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీ నాయ‌కుల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ భూష‌ణ్ కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు. జ‌గ‌న్‌కు ఎన్ని స‌ల‌హాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోర‌ని.. త‌న మొండి వైఖ‌రి త‌న‌దే అని ప్ర‌శాంత్‌కు నందిగామ ఘ‌ట‌న‌తో తెలిసివ‌చ్చింద‌ట‌. అందుకే జ‌గ‌న్‌తో ఉంటే క‌ష్ట‌మ‌ని ఆయ‌న భావించి దూర‌మ‌వ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

2019 ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు జ‌గ‌న్ విశ్వప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన‌ వ్యూహాల కోసం.. దేశంలోనే బెస్ట్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్‌ను త‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. అయితే తాను చెప్పిన‌ట్టే వింటేనే ప‌నిచేస్తాన‌ని ప్ర‌శాంత్ కిశోర్ ముందే కండిష‌న్ పెట్టార‌ట‌. దానికి స‌రేన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ట‌. కానీ ఇప్పుడు ఆ హామీని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌శాంత్ తీవ్రంగా క‌ల‌త చెందార‌ట‌.

` రెండుళ్ల‌లో నేనే సీఎం` అని అన‌డం స‌రికాద‌ని, ఇక ఆ మాట‌లు మాట్లాడొద్ద‌ని జ‌గ‌న్‌కు ప్ర‌శాంత్ కిశోర్‌.. స‌ల‌హా ఇచ్చార‌ట‌. అయితే ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగ‌డం.. అక్క‌డ జ‌గ‌న్ కొత్తగా అధికారుల‌పైనే బెదిరింపుల‌కు దిగ‌డం ప్ర‌శాంత్‌కు న‌చ్చ‌లేద‌ట‌. అధికార యంత్రాంగంతో ఇంత క‌టువుగా మాట్లాడ‌టం అవ‌స‌ర‌మా అని ప్ర‌శాంత్ కిశోర్… జ‌గ‌న్ ను ప్ర‌శ్నించారని స‌మాచారం. అధికారంలోకి రావాలంటే వారి మ‌ద్దుకు కూడా అవ‌స‌ర‌మ‌ని ఉండాల‌ని చెప్పార‌ట‌. ఈ మాట‌ను జ‌గ‌న్ అంత సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డంతో ప్ర‌శాంత్ నొచ్చుకున్న‌ట్టు స‌మాచారం.

ఇక జ‌గ‌న్ కు దూర‌మైపోవ‌డ‌మే క‌రెక్ట్ అని ప్ర‌శాంత్ కిశోర్ అనుకుంటున్నార‌ట‌. ఇవే స‌ల‌హాలు వేరే ఇత‌ర పార్టీకి ఇస్తే… వారికైనా లాభం ఉంటుంది కాబ‌ట్టి వైసీపీ వ్యూహ‌క‌ర్త బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయి. ప్ర‌శాంత్ కిశోర్ వెళ్లిపోతే వైసీపీకి పెద్ద న‌ష్టం త‌ప్ప‌ద‌ని గుసగుస‌లాడుకుంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌టికైనా వ్య‌వ‌హార శైలి మార్చుకుంటారో లేదో!!