జీవితంలో కొరుగునే గుర్తింపు ఇదే:రేణు దేశాయ్

ఈ ఫొటోలో అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య.బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ లు ప్రేమించి పెళ్లి చేసుకుని అకిరా నందన్,ఆధ్య అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక విడిపోయిన విషయం తెలిసిందే.అయితే పిల్లలిద్దరూ రేణు దేశాయ్ తోనే వుంటున్నారు.ఆతరువాత పవన్ ఓ రష్యన్ మోడల్ ని మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే వీరిద్దరికీ ఓ పాపా పుట్టింది.ఇదే విషయాన్నీ స్వయంగా పవన్ తిరుపతి సభలో వెల్లడించాడు.

ఆసంగతెలా వున్నా ఈ మధ్యన రేణుదేశాయ్ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా పవన్ తో ఉన్న తీపి గుర్తులన్నిటిని ఒక్కోటిగా షేర్ చేస్తోంది.తాజాగా రేణు తన కూతురి ఫోటో ఒకటి షేర్ చేసింది.అయితే ఈ ఫొటోలో ఆధ్య చేతిపైన యు అర్ ది బెస్ట్ మామ్ అని రాసుకుని ఉండగా దానికి రేణు నా జీవితం లో నేను కోరుకునే గుర్తింపు ఇదే..అది నా దేవత ఆధ్య ఎప్పుడు నాకిస్తూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది రేణు.