జ్యో అచ్యుతానంద TJ రివ్యూ

సినిమా : జ్యో అచ్యుతానంద
ట్యాగ్ లైన్:అవసరాల కి ఈ హిట్ అవసరం
రేటింగ్:3/5
నటీనటులు : నారా రోహిత్, నాగ శౌర్య, రెజినా కాసాండ్రా. నాని ప్రతేయక ఆకర్షణ.
సినిమాటోగ్రఫీ : వెంకట్ సి దిలీప్.
ఎడిటింగ్: కిరణ్ గంటి.
ఆర్ట్: సబ్బాని రామకృష్ణ
నిర్మాత : సాయి కొర్రపాటి.
బ్యానర్ ; వారాహి చలన చిత్రం.
సంగీతం : కళ్యాణ్ కోడూరి.
స్క్రీన్ ప్లే,కథ,దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల.

మూస సినిమాలు..మసాలా సినిమాలతో విసిగి వేసారిపోయిన తెలుగు ప్రేక్షకులకి పెళ్లిచూపులు సినిమా ఊరటనిస్తే ఈ జ్యో అచ్యుతానంద సినిమా ఆ ఊరటని కొనసాగించింది.తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్స్ కి కొదవ లేదు అని,అవకాశం రావాలె గాని దాన్ని ప్రూవ్ చేయడానికి మెం రెడీ అని దర్శకుడిగా మారిన నటుడు శ్రీనివాస్ అవసరాల నిరూపించాడు.తీస్తోంది రెండో సినిమానే అయినా ఫార్ములా సినిమాలకి దూరంగా అవసరాల సినిమాని డీల్ చేసిన విధానం మెచ్చుకోవాల్సిందే.

జ్యో,అచ్యుత్,ఆనంద్ అనే ముగ్గురి మధ్య జరిగే కథే ఈ జ్యోఅచ్యుతానంద సినిమా.టైటిల్ ని 100% జస్టిఫై చేసిన సినిమా ఇది.అచ్యుత్ ఆనంద్ అనే ఇద్దరు అన్నదమ్ములు జ్యో అనే అమ్మాయి ప్రేమను పొందడం కోసం పడ్డ పాట్లు ఏంటి..పెళ్ళయిపోయిన అచ్యుత్ ఆనంద్ ల జీవితం లోకి జ్యో మళ్ళీ ఎందుకొచ్చింది..జ్యో రాకతో అచ్యుత్ ఆనంద్ ల జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నదే కతాంశం.కథ పరంగా చెప్పుకోవడానికి పెద్ద కథ కాకపోయినా..ఇందులో పెద్ద పెద్ద ట్విస్ట్స్ లేకపోయినా దర్శకుడు అవసరాల కథను నడిపిన తీరే సినిమాకి ప్రాణం పోసింది.

అసలు సినిమా ఓపెనింగ్ షాట్ ఏ హైలైట్ అని చెప్పాలి.ఎందుకంటే ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల సినిమా లో హీరోయిన్ ఎవరికి దక్కుతుందో అన్న సస్పెన్స్ ఎలిమెంట్ చివరి వరకు ఉండటం మనం చూసాం.అయితే అవసరాల మాత్రం 1st షాట్ లోనే అదేమీ లేకుండా ఇద్దరు హీరోలకు పెళ్ళయిపోయి వారి ఫామిలీ ఫోటోషూట్ చేసే షాట్ తో సినిమాని ఓపెన్ చెయ్యడం తోనే తానేంటో చెప్పకనే చెప్పాడు.నిజంగా ఓ రెండో సినిమా దర్శకుడు సినిమాని ఇలా ఓపెన్ చెయ్యడానికి చాలా గట్స్ ఉండాలి..అవసరాల కథని మొత్తం స్క్రీన్ ప్లే ని బేస్ చేసుకుని నడిపిన తీరు శభాష్ అనిపిస్తుంది..స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది..పేపర్ పైన గొప్ప కథలుగా కనపడే వాటిని కూడా వెండితెరపై ఆవిష్కరించడంలో విఫలమైన సందర్భాలెన్నో..అలాంటిది..ఓ సదా సీదా కథని..కథనంతో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో అవసరాల నడిపిన తీరే ఈ సినిమాకి హైలైట్.

అంత బాగానే వున్నా.. జ్యో,అచ్యుత్,ఆనంద్ ల పాత్రలు క్యారెక్టర్రైజేషన్ అంత కన్విన్సింగ్ గా లేదు..సినిమాలో అక్కడక్కడా ఎవరు ఎప్పుడు ఎందుకు అలా ప్రవర్తిస్తారో అర్థం కాదు..భావోద్వేగాల్ని బయటపడనీయకుండా అన్నదమ్ముల మధ్య అంతర్లీనంగా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుందనేదే బేస్ ప్లాట్ ఈ సినిమాకి..అయితే సొంత తమ్ముడు దగ్గరే అన్న వడ్డీ తీసుకోవడం..తమ్ముడికి నాన్న ఇచ్చిన గిఫ్ట్ ని అన్న అమ్మేయడం..తమ్ముడ్ని వేరెవడో కొడుతున్న చూస్తుండడం..నాకు నేను నా పెళ్ళామే ముఖ్యం అనడం లాంటి సీన్స్ అంత కన్విన్సింగ్ గా లేవు.ఇక జ్యో క్యారెక్టర్ కూడా అస్త వ్యస్తంగానే ఉంటుంది..ఈ ముగ్గురి క్యారెక్టర్స్ ని విడివిడిగా ఇంకా బాగా హాండిల్ చేయాల్సింది..అయితే అవసరాల మొదటి సినేమానా కాబాట్టి అది అర్థం చేసుకోదగినదే.

ఇక సినిమాలో నారా రోహిత్ నున్నగా బొద్దుగా గుండ్రంగా వున్నాడు ..నటన పరంగా బాగానే చేసినా..ఆకారం ఇలాగే ఉంటే మాత్రం రోహిత్ బాబు వేరే దారి చూసుకోక తప్పదు.. నాగసౌర్య చార్మింగ్ గా చాలా నాచురల్ గా చేసాడు..సినిమా సినిమాకి నాగ సౌర్య బాగా మెచ్యూర్ అవుతున్నాడు .ఇక రెజీనా స్క్రీన్ పైన సింప్లి సూపర్బ్ అనిపించేలా వుంది.. తన కాస్ట్యూమ్స్ రెజీనా కి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి .ఒక 1 మినిట్ గెస్ట్ గా నాని అలరించాడు.వీళ్ళు కాక సినిమాలో మిగిలిన పాత్రలకి పెద్ద గుర్తింపు లేదు.సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద అసెట్..మ్యూజిక్ బాగుంది..డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి..కామెడీ పంచ్ లు చాలానే వున్నాయి సినిమాలో..అవి కూడా అతికించినట్టు కాకుండా సందర్బోచితంగా నవ్వు తెప్పిస్తాయి..ఇక అక్కడక్కడా ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగానే పేలాయి.ముక్యంగా అన్నయ్యగా నేను ఓడిపోయినా పర్లేదు కానీ అన్నదమ్ములుగా మాత్రం మనం ఊడిపోకూడదు లాంటివి.

వారాహి బ్యానర్ పైన చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్న సాయి కొర్రపాటి, శ్రీనివాస్ అవసరాల లాంటి కంటెంట్ ఉన్న టెక్నీషియన్ కి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం ఎంతైనా మెచ్చుకోవాలి.ఆ సాహసం వూరికే పోలేదు..ఒక మంచి ప్రయోగాత్మక హిట్ తో అవసరాల తానేంటో నిరూపించుకున్నాడు.చిన్న చిన్న పొరపాట్లు జరిగినా భవిషత్ లో అవసరాల నుండి మరిన్ని మంచి సినిమాలు ఆశించవచ్చు.