టాలీవుడ్ లోకి మరో మెగా డాటర్

మరో మెగా వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అయితే నటనలో కాదండోయ్.. నిర్మాణ రంగంలో తన సత్తా చాటడానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా…. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. రజినీకాంత్ కూతరు సౌందర్య లాగే శ్రీజ కూడా సినీ నిర్మాణంలోకి ఎంటరవ్వాలని ఆశపడుతోందంట. మొదట లోబడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్  , అల్లు కుటుంబం నుంచి అల్లు అర్జున్, శిరీష్ ఉండగా… లేటెస్ట్ గా నిహారిక ఒక మనుసుతో ఆకట్టుకుంది. వీళ్లతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనర్ లుగా నిహారిక తల్లి పద్మజ… చిరంజీవి పెద్ద కూతురు సుశ్మిత ఎంటరయ్యారు. మెగాస్టార్ 150వ సినమా కత్తిలాంటోడు మూవీకి సుశ్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది. ఇక ఇప్పుడు శ్రీజ ప్రొడక్షన్ లోకి వచ్చేస్తోంది. అయితే పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నట్టు సమాచారం.