టీడీపీ:తెలుగు వారి దౌర్భాగ్యాపు పార్టీ

రాజ్యసభలో కేవీపీ ప్రయివేట్ మెంబెర్ బిల్ చర్చ వాడి వేడిగా జరిగింది.అయితే సిగ్గు పడాల్సిన విషయమేంటంటే దేశం మొత్తం పార్టీలకతీతంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యక హోదా కోసం నిందిస్తుంటే అధికార టీడీపీ మాత్రం అత్యంత జుగుప్సయాకరమైన రీతిలో బీజేపీ ని వెనకేసుకు రావడం చూస్తే నిజంగా తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టి తగలబెట్టేశారు.

ఎంతసేపు కాంగ్రెస్ అన్యాయంగా విభజించింది..ఇదంతా కాంగ్రెస్ వల్లనే..మొత్తం కాంగ్రెస్ చేసింది అని పాడిన పాటే పాడి..బీజేపీ హామీ ఇచ్చింది..కచ్చితంగా అమలు చేస్తుందన్న నమ్మకం మాకుంది అని మొత్తం చర్చనంతా నీరుగార్చేందుకు ప్రయత్నం తప్ప బీజేపీ కి బిగుస్తున్న ఉచ్చు మరించి గట్టిగా బిగించడం మాత్రం టీడీపీ చేయనే లేదు.

అసలు టీడీపీ అజెండా ఏమిటి.డీక్షుడు చంద్రబాబు ఏమి కోరుకుంటున్నారు అనేది ఆలోచిస్తే క్లియర్ గా మనకి ఒకటే అర్థం అవుతుంది.టీడీపీ ఎంత సేపు బీజేపీ కి సాగిలపడంతప్ప ఇంకోటి చేయలేదు.చేయదు కూడా.అదే బాబు అజెండా.బీజేపీ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుకున పెట్టొద్దు.కుదిరితే కాంగ్రెస్ అన్యాయం చేసిందని మాత్రమే మాట్లాడాలి ఇదే మొత్తం చర్చంతా చూస్తే టీడీపీ అజెండా.

నిజంగా సిగ్గు పడాలి.ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ లో మనం వెనుకబడిపోయాం..మనకు లోటుబడ్జెట్ అని ఏడవటం తప్పితే చేసిందేమి లేదు. వచ్చిన ఒక్క అవకాశాన్ని రాజ్యసభలో వినియోగించుకుని కేంద్రం పై అన్నీ వైపులా ఒత్తిడి తెచ్చి మనకు దక్కాల్సిన ప్రత్యేకహోదాకి సాధించుకోవడం వదిలేసి ఎంతవరకు రాజకీయ మైలేజీకే ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా చంద్రబాబు సిగ్గుపడాలి.

టీడీపీ రాజ్యసభ ఎంపీ లు చర్చలో మాట్లాడిన తీరు చూసి నిజంగా తెలుగు వాడంటే చేత కానీ వాడు,చవట దద్దమ్మ అని రాజ్యసభలో డంకా మోగించి మరీ చాటింపు వేసినట్టుంది.సీఎం రమేష్ గారు మాట్లాడుతున్నారు పాపం ఆయన బాధేమిటో ఎవ్వరికి అర్థం కాలేదు.బీజేపీ ని కాపాడటానికి ఆయన పడిన ప్రయాస చూస్తే ..బానిస బ్రతుకే నయమనిపించింది.ఆయనే కాదు మిగిలిన టీడీపీ ఎంపీ లందరిది ఇదే తీరు..బీజేపీ ఆత్మరక్షణే ద్యేయం.నిజంగా తెలుగువాడి ఆత్మా గౌరవమంటూ నినదించిన ఎన్టీఆర్ గారు బ్రతికుండుంటే నిజంగా అప్పుడు కాదు ఇప్పుడు గుండెపగిలి విలపించేవారు.ఇందుకా నా తెలుగుదేశం పార్టీ ఇంకా బ్రతికే వుంది అని.