తమన్నా ఇది నిజమేనా? 

‘బాహుబలి ది బిగినింగ్‌’లో తమన్నా పాత్ర కోసం చాలా ప్రచారాలు జరిగాయి విడుదలకు ముందే. అందంగా రాజకుమారి పాత్రలో కనిపిస్తుందట మిల్కీ బ్యూటీ అని ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె అందంగా కనిపిస్తుంది మొదటి పార్ట్‌లో. అసలే ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అందులోనూ ఉద్యమకారిణిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపిస్తుంది మిల్కీ బ్యూటీ. కానీ రెండో పార్ట్‌లో మాత్రం అలా కాదట. అనుష్కతో పోలిస్తే తక్కువ నిడివి పాత్ర అయినా ఆమెది, కనిపించినంత సేపు రాకుమారిలాగే కనిపిస్తుంది అని సమాచారమ్‌. అంతేకాదు గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు కూడా చేస్తుందట రెండో పార్ట్‌లో తమన్నా.

వాస్తవానికి రెండో పార్ట్‌ అంతా అనుష్కదే అనే ప్రచారం బాగా నడుస్తోంది. మరి మిల్కీ బ్యూటీకి ఇంత ఛాన్స్‌ ఉంటుందా అనే విషయాన్ని ఆమె ముందు పెడితే, రాజమౌళి సినిమా అంటే అన్ని క్యారెక్టర్లను సమాన స్థాయిలో బ్యాలెన్స్‌ చేస్తారు. అలాగే ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’లో కూడా అందరి క్యారెక్టర్లను అవసరం మేరకు ఆకట్టుకునేలా డిజైన చేశారు అంటోంది ముద్దుగుమ్మ తమన్నా. ప్రస్తుతం తమన్నా ‘బాహుబలి’తో పాటు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘అభినేత్రి’లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభుదేవా, సోనూ సూద్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.