తమన్నా డబ్బుకోసమే చేస్తుందట

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ లోకూడా నర్తిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తుంది. తమన్నా తో పాటు మిగిలిన టాప్ హీరోయిన్స్ అయిన శృతిహాసన్, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు.

అయితే ఐటెం సాంగ్స్ విషయం లో మాత్రం కాజల్, శృతి ల కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువగా వుంది. ఒక్కో ఐటెం సాంగ్ కి 50 లక్షలనుంచి కోటి రూపాయలవరకు పారితోషకం తీసుకుంటుందట.తాజాగా జాగ్వార్ సినిమాలో ఐటెం సాంగ్ లో నర్తించటానికి కోటి రూపాయలు తీసుకుందని టాలీవడ్ సమాచారం.

తమన్నా కేవలం డబ్బుకోసమే ఐటెం సాంగ్స్ చేస్తోందన్న విమర్శలకు తమన్నా గట్టిగానే సమాధానమిచ్చింది. అవును నేను డబ్బుకోసమే ఐటెం సాంగ్స్ చేస్తున్నాను అంతేకాదు హీరోయిన్ గ కూడా డబ్బుకోసమే చేస్తున్న్నాను అసలు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే డబ్బు సంపాదించటానికి. పైగా నాకు డాన్స్ చేయాటం అంటే చాల ఇష్టం అలాగే ప్రేక్షకులకు నా డాన్స్ చూడటమంటే బాగా ఇష్టం అని అదృష్టం కొద్ది తనకి అలంటి అవకాశాలు వస్తున్నాయని చెప్పింది మిల్కీ బ్యూటీ.