‘తిక్క’కి లెక్కలు చూపించే టైమొచ్చింది

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ. ‘సుప్రీం’ సినిమా ముందు వరకూ తేజుది ఒక లెక్క, ఆ సినిమా తర్వాత ఇంకో లెక్క. ఎందుకంటే ‘సుప్రీం’ సాధించిన సంచలన విజయం అలాంటిది. మామూలు టాక్‌తోనే పెద్ద హిట్‌ సాధించింది ‘సుప్రీం’. దాంతో, భారీ ఆఫర్లతో ‘తిక్క’ని దక్కించుకున్నారట కొందరు డిస్ట్రిబ్యూటర్లు.

సినిమా రిలీజ్‌కి ముందు పాజిటివ్‌ బజ్‌ రావడంతో, సాయిధరమ్‌ ప్రీ రిలీజ్‌ ప్రాఫిట్స్‌ని ‘తిక్క’తో నిర్మాతకి అందించాడు. సునీల్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సునీల్‌రెడ్డి గతంలో ‘ఓం’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్‌ నటించి, నిర్మించాడు. కొన్ని కారణాలతో ఆ ప్రయోగం అప్పట్లో అంతగా విజయం సాధించలేదు. కానీ, త్రీడీ టెక్నాలజీలో సినిమా తీయాలన్న ఆ ప్రయత్నానికి అభినందనలు దక్కాయి.

‘తిక్క’తో ఎలాంటి ప్రయోగాలూ చేయకుండా, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని, డిఫరెంట్‌గా చెప్పబోతున్నాడు సునీల్‌రెడ్డి. అన్ని రకాల కమర్షియల్‌ హంగులతో పాటు, జనానికి నచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను తెరకెక్కించానంటున్నాడు డైరెక్టర్‌ సునీల్‌ రెడ్డి. సో రేపు విడుదల కాబోయే ‘తిక్క’ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!