తెలుగులో సూర్య రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు

సూర్య తమిళ కథానాయకుడే అయినా తెలుగు ప్రేక్షకులు ఆయన్ను తమవాడిగానే ఆదరిస్తారు. అందుకే.. ఆయన సినిమాలు తమిళంతో పాటూ తెలుగులోనూ సమాంతరంగా విడుదలవుతుంటాయి. ఇక్కడివారి ఆదరాభిమానాలతోనే తన ప్రాజెక్టులు ద్విభాషా చిత్రాలుగా ఉండేలా చూసుకుంటాడు సూర్య. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం సూర్య కొత్త మూవీ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ‘సింగం-3’ ఆంధ్రా-నైజాం రైట్స్ రూ.18కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మల్కాపురం శివకుమార్ ఈ హక్కులను సొంతం చేసుకున్నారని చెప్తున్నారు.

‘సింగం-3’కి ఇంత రేటు పలకడం ఫిల్మ్ నగర్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. సూర్యకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలోనే శివకుమార్ ఇంత సొమ్ము వెచ్చించి ఉంటారని అంటున్నారు. సూర్య కెరీర్లో తెలుగులో ఇది హయ్యస్ట్ రేటు. ట్రేడ్ వర్గాలలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు వచ్చిన హైప్ కారణంగానే ఈ రేటు పలికినట్టు తెలుస్తోంది. హరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, శ్రుతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.