థమన్ కి మెగా బూస్ట్

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ మధ్య అవకాశాలు తగ్గి రేస్ లో వెనుకబడ్డాడు.అదే టైం లో తన తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా దేవి శ్రీ ప్రసాద్,అనూప్ రూబెన్స్,మిక్కీ జ్ మేయర్ లాంటి యువ సంగీత దర్శకులు దూసుకుపోతున్నారు.సరిగ్గా ఇలాంటి టైం లో జరిగిన అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో వేడుక థమన్ కి బూస్ట్ నిచ్చించి.

ఇంతకీ విషయమేంటంటే ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్ రావడం..థమన్ ని పొగడతలతో ముంచెత్తడం జరిగింది.అల్లు శిరీష్ చిత్రానికి మంచి ట్యూన్స్ ఇచ్చాడని పొగిడేశారు. ఓ అడుగు ముందుకేసి తాను గనుక 151వ సినిమా చేస్తే మ్యూజిక్ డైరక్టర్‌గా తమన్‌నే తీసుకుంటానని అన్నారు. బాణీలు నచ్చితే నువ్వే నా మూవీకి సంగీత దర్శకుడివి అని వేదికపై తమన్‌తో చెప్పారు.

చిరు కష్టపడే వారికి అవకాశాలివ్వడం ఎప్పుడు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటాడు.ఈ క్రమంలోనే మెగాస్టార్‌ నుంచి ప్రోత్సాహం రావడంతో తమన్ ఆనందంతో పొంగిపోయాడు.చిరు ఇంత ఫ్రెండ్లీగా స్పందించడం తమన్‌కు బూస్ట్‌నిస్తుందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలిగా ఆయనకు సినిమాలు తగ్గిపోయాయి. స్టార్‌ హీరోలంతా ఇతర సంగీత దర్శకులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో చిరు..151 సినిమా ప్రస్తావన తేవడం.. ఆ చిత్రానికి మంచి ట్యూన్స్ ఇస్తే.. నువ్వే సంగీత దర్శకుడివి అని తమన్‌తో చెప్పడం.. ఈ మ్యూజిక్ కంపోజర్‌లో ఉత్సాహం నింపినట్లే.