నయీమ్ వెనుక టాలీవుడ్ పెద్దలు

నయీమ్ కేసు దర్యాప్తు శర వేగంగా సాగుతోంది.రోజు రోజుకి నయీమ్ ఆకృత్యాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే వున్నాయి.దీనిపై రక రకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా నాకే డైలీ పేపర్ చూస్తుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నయీమ్ విషయం లో అని అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే సీఎం కెసిఆర్ స్వయంగా దర్యాప్తు అధికారుల్ని పుకార్లకు తావు లేకుండా కేసుకు సంబంధించి ఏ రోజు కారోజు పోరోగతిని పత్రికా ముఖంగా వివరించాల్సిందిగా ఆదేశించారు.

అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నయీమ్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు.వీళ్ళు రెండు రకాలుగా వున్నారు.కొందరు నయీమ్ బేందిరింపులకు బాధితులు కాగా ఇంకొందరు మాకు నయీమ్ తో ఎలాంటి సంబంధం లేదు అని బయటికొచ్చి చెప్పుకోవాల్సిన వాళ్ళు.నయీమ్ బాధితుల లిస్ట్ లో సామాన్యుల దగ్గరినింది రాజకీయనాయకుల వరకు అనేకమంది ఉండటం సంచలనం రేపుతోంది.

అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సినీ పరిశ్రమ నుండి బాధితులెవరూ ముందుకు రాలేదు.అయితే తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్ మీడియా ముందుకొచ్చాడు.నయీమ్ నన్ను కూడా బెదిరించాడని, నర్సంపేటలో ఉన్న తన కోటి రూపాయల విలువ చేసే థియేటర్ ని కేవలం 25 లక్షలిచ్చి లాక్కున్నాడని నట్టికుమార్ చెప్తున్నారు.అంతే కాకుండా నయీమ్ సినీ పరిశ్రమలో పెద్దలు అనేక మంది అండదండలున్నాయని సంచలన వాక్యాలు చేసాడు.ఆ పెద్దలెవరా అన్న విషయం పై సర్వత్రా చర్చ జరుగుతోంది.ఇంకా ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ధియేటర్లలో క్యాంటీన్లు అన్ని నయీంకు చెందినవేనని చెప్పారు.

మొత్తానికి త్రిల్లర్ సినిమాని తలపిస్తున్న నయీమ్ కేసు ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతూ ఎవరెవర్ని బయట పడేస్తుందో..ఏ ఏ పెద్ద తలల్ని లోపలి పంపిస్తుందో ఆసక్తి కరంగా వుంది.