నాగ్ కి గెస్ట్ గా అనుష్క!!

అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. అరుంధతి బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటి అనుష్క ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుంది. త్వరలో అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద రావు కాంబినేషన్ లో ఓం నమో వెంకటేశాయ సినిమా రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున వెంకటేశ్వర స్వామికి వీర భక్తుడైన హథీ రామ్ బాబా గా నటిస్తుండగా, ఇదే సినిమాలో అనుష్క సన్యాసిని గా నటించబోతున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇది నిజమే అయితే ఈ పాత్ర అనుష్క కెరీర్ లో మరో మరపురాని చిత్రం అవుతుంది. అనుష్క నాగార్జున చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడం సెంటిమెంట్‌గా మారింది అనే చెప్పాలి. సోగ్గాడే చిన్ననాయనా చిత్రంలోను, ఊపిరి చిత్రంలోను నాగార్జున జోడిగా గెస్ట్ రోల్ చేసింది. ఆ చిత్రాలు రెండు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. ఆదే సెంటిమెంట్‌తో ఓం నమో వెంకటేశాయ చిత్రంలోను ఈ జంట ప్రేక్షకులకు కనులపంట చేస్తారని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క బాహుబలి ది కన్క్లూషన్, భాగమతి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.