నాగ్ న్యూలుక్

మాస్ పాత్ర అయినా, క్లాస్ పాత్ర అయినా… నాగార్జున లుక్ అందుకు తగ్గట్టు ఇట్టే మారిపోతుంది. గ్రీకువీరుడులో పిల్లిగెడ్డంతో, శ్రీరామదాసులో పొడవాటి జుట్టుతో, సోగ్గాడే… లో నిజంగా సోగ్గాడిలాగే… రకరకాల గెటప్ లు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో సూపర్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుం నిర్మల కాన్వెంట్లో ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. మోకాలి వరకు మడతపెట్టిన ప్యాంటు, టోపీ, గెడ్డం, చేతిలో గిటార్ తో ఆయన న్యూలుక్ నిజంగా అదిరింది. శ్రీకాంత్ తనయుడు హీరోగా నిర్మల కాన్వెంట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు నాగార్జునే నిర్మాత కూడా.