నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షల కోట్లు హాంఫట్

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను సంక్షోభంలోకి నెట్టింది. భారత మార్కెట్లను ఈ వోట్ కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రారంభమైన కేవలం నాలుగు నిమిషాల్లోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారు. అన్ని లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి సంపద లెక్కేసుకుంటే 98 లక్షల కోట్ల దిగువకు పడిపోయినట్లు తేలినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్న మార్కెట్లు ముగిసేనాటికి మొత్తం విలువ 101.4 లక్షల కోట్ల దాకా ఉంది. అది ఇవాళ ఉదయం ప్రారంభ వేళకు అంటే ఉదయం 9:26 గంటల వేళకు  నాలుగు లక్షల కోట్ల మేర నష్టపోయింది.

ఈయూ నుంచి బ్రిటన్ వైదొలుగుతోందన్న నిర్ణయం వెలువడుతున్న సమయంలో క్రమానుగతంగా ఇన్వెస్టర్లు వందల కోట్ల రూపాయల మేర లావాదేవీల్లో కోల్పోయారు. సెన్సెక్స్ కూడా 1058 పాయింట్లు నష్ట పోయింది. మరేం ఫర్వాలేదని, అవసరమైతే లిక్విడ్ కేష్ ను మార్కెట్లలోకి పంప్ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘరామ్ రాజన్ భరోసా ఇచ్చినప్పటికీ పతనం ఆగలేదు. బ్రిటన్ లో ఉన్న ఇండియన్ కంపెనీల ఆపరేషన్స్ పై కూడా పెను ప్రభావం ఉండొచ్చన్న భయసందేహాలు చుట్టుముట్టాయి. ఇప్పటికీ మార్కెట్లు కోలుకోలేదు