నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం

తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది.

ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి ఓడింది.గెలుపోటములు ఆటలో సహజం.అయితే ఓడినా మనం ఎలా పోరాడామన్నదే ముఖ్యం.సింధు చూపిన పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శ ప్రాయం గా నిలుస్తుంది.భవిష్యత్ లో మరెన్నో చేతులు బ్యాట్మింటన్ రాకెట్స్ చేతబట్టి మనకు కనిపిస్తారు.

ఫైనల్స్ లో సింధు ఓడినా దేశమంతా సింధు నామస్మరణతో మారుమోగుతోంది.ఇక సోషల్ మీడియా లో అయితే ప్రతి ఒక్కరు సింధుని అభినందనలతో ముంచెత్తుతున్నారు.సామాన్యుడి దగ్గరినుండి,సెలబ్రిటీ లు రాజకీయనాయకులు,ఇలా ప్రతి ఒక్కరు సింధు కి సలాం కొడుతున్నారు.ఇక సూపర్ స్టార్ రాజీకాంత్ అయితే ఏకంగా నేను నీ ఫ్యాన్ ని అయిపోయా సింధు అన్నాడంటే సింధు ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

సిల్వర్ మెడల్ తో మెరిసిన సింధూకి నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.కోటి నజరానాగా ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ.50 లక్షల బహుమతిని ప్రకటించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింధూకి రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్ కు రూ.10లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్సర్ రూ.60లక్ష బీఎండబ్య్లూ కారును బహుమతిగా ప్రకటించారు.