పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!

ఏపీ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారుగా కేంద్ర మంత్రి సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను సీఎం చంద్ర‌బాబు ఏరికోరి నియ‌మించుకున్నారు. అయితే, ఆయ‌న కొన్నాళ్ల‌లోనే వివాదాస్ప‌ద‌మ‌వ‌డంతో స‌మాచార క‌మిష‌న‌ర్‌ని నియ‌మించిన చంద్ర‌బాబు ప‌ర‌కాల ప‌వ‌ర్స్‌ని క‌ట్ చేశారు. సీఎం ప‌రువు పోయేలా కామెంట్లు చేశార‌ని ప‌ర‌కాల‌పై ప‌లువురు నేత‌లు ఇంట‌ర్న‌ల్‌గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ త‌ర్వాత ప‌ర‌కాల మీడియాలో క‌నిపించ‌డం దాదాపు త‌గ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హ‌త లేక‌పోయినా) క‌నిపించిన ప‌ర‌కాల ఆ త‌ర్వాత అయిపు లేకుండా పోవ‌డమే కాకుండా.. అంద‌రూ ఏపీకి త‌ర‌లిపోతుంటే.. తాను మాత్రం హైద‌రాబాద్‌లో మ‌కాం పెట్టారు.

ఇక‌, ఈ క్ర‌మంలో ఇప్పుడు చంద్ర‌బాబు పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ మంత్రం జ‌పిస్తూ.. దావోస్ ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం ప్రపంచ ఆర్థిక వేదిక స‌దస్సు పేరుతో దావోస్ లో నిర్వ‌హించిన స‌ద‌స్సుకు త‌మ‌కు కూడా ఆహ్వానం అందింద‌ని బాబు ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న త‌న మంత్రి వ‌ర్గం, అధికారుల బృందంతోపాటు ప‌ర‌కాలను కూడా చంక‌లో పెట్టుకుని వెళ్లార‌ట‌! ఇప్పుడు ఇదే త‌ప్ప‌యింద‌ని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అన‌వ‌స‌ర విష‌యాల‌పై ప‌ర‌కాల ఫోక‌స్ చేశార‌ని, దీనివ‌ల్ల బాబు ప‌రువు పోతోంద‌ని సాక్షాత్తూ అధికారులే వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

దావోస్ నుంచి ఓ వీడియోను పోస్ట్ చేశారు ప‌ర‌కాల‌. దీనిలో పెద్ద పెద్ద గొప్ప‌లు పోయారు. అవేంటంటే.. దావోస్‌లో క‌మ్మటి తెలుగు భోజ‌నం దొరుకుతోంద‌ని, పాల‌కూర ప‌ప్పు, బెండ‌కాయ వేపుడు, సాంబారు వంటి వాటితో సుష్టుగా భోం చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంత‌టితో ఆగ‌కుండా త‌మ‌కు అక్క‌డ పెవిలియ‌న్ ల‌భించింద‌ని అన్నారు. అయితే, వాస్త‌వానికి ఇదంతా డ‌బ్బా!! దావోస్ సమావేశం జరిగే చోట డబ్బులు కడితే ఎవరికైనా పెవిలియన్ ఇస్తారు.

కానీ దేశంలో ఎవరికీ ఇవ్వనిరీతిలో ఏపీకి మాత్రమే పెవిలియన్ కేటాయించినట్లు చెప్పారు. అది డబ్బులు పెట్టి తీసుకున్నదే తప్ప..ఏపీ సీఎం చంద్రబాబు…పరకాల ప్రతిభ గుర్తించి ఇచ్చిందేమీకాదు. ఇక‌, ఏపీ వంట‌లంటూ చేసిన హ‌డావుడి.. మొత్తం ప‌రువు తీసింది! వాస్త‌వానికి దావోస్ ఆహార అల‌వాట్లు డిఫ‌రెంట్‌. కానీ, మ‌న ప‌ర‌కాల మాత్రం అధిరిపోయే డ‌బ్బా దంచేశారు. దీంతో బాబు ప‌రువు పోయింద‌ని ల‌బోదిబో మంటున్నారు అధికారులు! మ‌రి  ఈ దెబ్బ‌కి చంద్ర‌బాబు ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.