పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి వుండే క్రెజే వేరు అయితే కాటమరాయుడు సినిమా రిలీజ్ రోజు అభిమానులకు నిరాశ ఎదురయింది. హైదరాబాద్ ప్రాంతంలో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా దాని తాలూకా బెన్ఫిట్ షో మాత్రం కూకట్ పల్లి లోని థియేటర్స్ లో పడాల్సిందే. అలాంటిది నిన్న రాత్రి ఎంతో ఆశగా బెనిఫిటీషో కోసం కూకట్ పల్లి లోని భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్స్ దగ్గర అభిమానులు పోటెత్తారు.

అయితే అక్కడ సడన్ గా పోలీస్ లు ఎంట్రీ ఇచ్చి  బెనిఫిటీషో కు పరిమిషన్ లేదని అక్కడున్న అభిమానులను చెదరగొట్టారు. అయితే అభిమానులు మాత్రం బెనిఫిటీషో చూడకుండా వెళ్లే ప్రసక్తే లేదని అక్కడే ఉండిపోయి పోలీస్ లతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ లో పవన్ అభిమానులపై లాఠీఛార్జ్ కూడా చేసారు. అయినా అభిమానులు మాత్రం తెల్లవార్లూ అక్కడే బెనిఫిట్ షో కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు.

రాత్రి 12 గంటలకు అక్కడకు వచ్చిన అభిమానులు ఉదయం 7 గంటలవరకు బెనిఫిట్ షో కోసం ఎదురు చూస్తూనే వున్నారు కానీ ఫలితం లేకపోయింది. చివరికి నిరాశతోనే వెనుతిరగాల్సి వచ్చింది.

4

3

21