పవన్ కి ఓకే చెప్పిన శృతి

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గురించి అనేక పుకార్లు వినిపించాయి.ముందుగా ఖుషి డైరెక్టర్ SJ సూర్యతో సినిమా అనుకున్నారు.దానికి సంబంధించి పూజా కార్యాక్రమాలు కూడా నిర్వహించారు.అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండి సూర్యని తప్పించి డాలి పేరు తెరపైకి వచ్చింది.

అయితే డాలి తో సినిమా కంటే ముందే పవన్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వినిపించాయి అయితే ఎట్టకేలకు డాలి సినిమా నే మొదలుపెట్టనున్నాడు పవన్.

ఇప్పటికే పవన్ తో నటించిన శృతి హాసన్ పవన్ సరసన బెస్ట్ అనిపించుకుంది పవన్ శృతిల కాంభినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే వీళ్ళిద్దరే డాలి సినిమాలో మళ్ళీ జతకట్టనున్నట్టు చిత్ర నిర్మాత శరద్ మరార్ ధృవీకరించారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో మొదలుకాబోతుంది.

ఇదే జరిగితే గబ్బర్ సింగ్ రిజల్ట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.