పవన్ ని ‘బోస్’ అంటున్న దాసరి

జనసేన అధినేత గా రాజకీయాల్లో, పవర్ స్టార్ గా సినిమాల్లో తన సత్తా చాటుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్యకాలం లో పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ కాంబినేషన్లో ఒకసినిమా రాబోతోందని గుసగుసలు వినిపించాయి. 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నే చేస్తాడనే టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో ‘బోస్’ అనే టైటిల్ ఒకటి రిజిస్టర్ అయ్యిందట. అది రిజిస్టర్ చేయించింది దాసరి నారాయనే పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం చేసినట్టు అనుకుంటున్నారు. 2019 లో జరగబోయే ఎన్నికలలో జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానుందని, దాని దృష్టి లో పెట్టుకునే పవన్ కి రాజకీయ మైలేజ్ తెచ్చేనందుకు ఉపయోగ పడేవిధంగా ఈ ‘బోస్’ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం లో నిర్మించే ఉద్దేశంలో దాసరి ఉన్నట్టు టాలీవుడ్ సమాచారం.