పవన్ పై అభిమానం ప్రాణం తీసింది

సినిమాలంటే మోజు ఉండొచ్చు..సినిమా హీరోలంటే అభిమానంఉండొచ్చు..కానీ అవి హద్దుల్లో ఉంటేనే అందం..హద్దు మీరితే వికృత రూపం దాలుస్తుంటాయి.అయినా ఫేస్బుక్..వాట్సాప్ అంటున్న ఈ ఆధునిక యుగం లో కూడా హీరోలంటే వెర్రితలలేసే అభిమానులున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు.

అసలు విషయం లోకి వస్తే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు.పేరు వినోద్,ఊరు తిరుపతి.పార్టీ తరపున ఓ చారిటి కార్యక్రమానికి కర్ణాటకలో ఉన్న కోలార్ నగరానికి వెళ్లిన వినోద్ కి తోటి స్నేహితుడితో అభిమాన హీరో విషయమై చిన్న వాగ్వాదం జరిగింది.వినోద్, స్నేహితుడు మధ్య పవన్ కళ్యాణ్ ఇంకో యువ నటుడి మధ్య చర్చ గొడవకి దారితీసింది.అంతే యువ నటుడి అభిమాని అయిన వినోద్ స్నేహితుడు వినోద్ ని కత్తితో పొడిచేసాడు.మిగతా స్నేహితులు ఆసుపత్రికి వినోద్ ని తీసుకెళ్లినా అప్పటికే వినోద్ మరణించాడు.

ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితం ఉంటుంది.ఎన్నో బరువులు..బాద్యతలు ఉంటాయి.వాటన్నిటిని పక్కన పెట్టి ఎవరో సినిమా నటుల గురించి ప్రాణాలు తీసుకునే విష సంసృతి ఎవ్వరికి అంత మంచిది కాదు.ఆ మధ్య భీమవరం లో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫాన్స్ రోడ్లెక్కి మరీ కాశ్మీర్ తరహాలో ఒకరిపై ఒకరు రాళ్ళూ విసురుకోవడం కూడా ఇలాంటిదే.

ఓ వైపు గ్లోబలైజషన్,ఆధునికీకరణ,కంప్యూటర్ యుగం అంటూ ప్రపంచమంతా ముందుకెళ్తుంటే మనం మాత్రం సినీ హీరోల కోసం వెర్రి వాళ్ళ లాగా కొట్టుకు చావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.