పవర్ స్టార్ రూటే సెపరేటు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే కాస్త భిన్నంగా ప్రవరిస్తుంటాడు. తన సినిమాల ఫంక్షన్స్ కే మొక్కుబడిగా హజరయ్యే ఈ స్టార్ హీరో ఇతర సినీ వేడుకల్లో అసలే కనిపించడు. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల వేడుకలకు వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాడు. ఇక తన అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కోసం మాత్రం రెండు మూడు సార్లు ఆడియో వేడుకల్లో పాల్గొ న్నాడు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూటు మారుస్తు న్నాడు. ఇటీవల విడుదలైన సర్ధార్ గబ్బర్‌సింగ్ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఉత్సా హంగా పాల్గొన్న పవన్. తరువాత యూరప్‌లో జరి గిన ఓ పబ్లిక్ ఫంక్షన్‌కు కూడా హాజరై అందరినీ ఆశ్చ ర్యపరిచాడు. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో జరిగిన ఓ అవార్డ్స ఫంక్షన్‌లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన నెక్ట్స సినిమాలో ఎలా కనిపించబోతు న్నాడో అదే లుక్‌లో ఈ వేడుకకు హజర య్యాడు పవన్.

గోపాలా గోపాలా చిత్ర దర్శకుడు డాలీ తో తెరకెక్కే చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కసరత్తులు చేస్తున్నాడు. సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రం ఇచ్చిన చేదు మాత్ర పవన్‌కు మింగుడు పడకుంది. అందుకే ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యం అయినా ప్రేక్షకులకు , అభిమా నులకు హిట్ చిత్రం ఇవ్వాలని పవన్ కృషి చేస్తున్నారు. డాలీ సంపూర్ణంగా స్క్రిప్ట్ ఓకే అన్నాకే సెట్ మీదకు వెళ్లాలి అని పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారు.