పోలిట్ బ్యూరోలో అవుట్ కేటీఆరా..? హ‌రీశా…?

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా పోలిట్‌బ్యూరో అనేది హార్ట్‌. పోలిట్‌బ్యూరోలో తీసుకునే నిర్ణ‌యాల‌తోనే పార్టీ ఫ్యూచ‌ర్ ఉంటుంది. ఆ పార్టీ ముందుకు వెళుతుంది. పార్టీకి సంబంధించిన అత్యున్న‌త స్థాయిలో జ‌రిగే నిర్ణ‌యాల‌న్ని పోలిట్‌బ్యూరోల‌నే తీసుకుంటారు. అలాంటి పోలిట్‌బ్యూరో విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకోనున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవును అనే ఆన్స‌రే వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరోలో టీం పెద్ద జంబోజ‌ట్‌లా ఉంది. ఇందులో 50కి మంది పైగా స‌భ్యులు ఉన్నారు. ఏదైనా విధాన‌ప‌ర‌మైన అత్యున్న‌త నిర్ణ‌యం తీసుకుంటే అది అస్స‌లు దాగ‌డం లేదు. ఈ 50 మందిలో ఎవ‌రో ఒక‌రి ద్వారా బ‌య‌ట‌కు, మీడియా వ‌ర్గాల‌కు లీక్ అయిపోతుంది. ఈ జంబోజ‌ట్ టీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే నిండా మున‌గ‌డం, సీక్రెట్లు లీక్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని భావించిన కేసీఆర్ పోలిట్‌బ్యూరోను 6 గురికి త‌గ్గించాల‌ని షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

50 మందికి పైగా ఉన్న పోలిట్‌బ్యూరోను 6కు త‌గ్గించ‌డం అంటే సామాన్య విష‌యం కాదు. ఈ పోలిట్‌బ్యూరో నిర్ణ‌యాల‌తోనే వ‌చ్చే ఎన్నికల‌కు సైతం వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. మ‌రో షాక్ ఏంటంటే ఇందులో త‌న త‌న‌యుడు కేటీఆర్‌, మేన‌ళ్లుడు హ‌రీశ్‌రావుల‌లో సైతం ఎవ‌రో ఒక‌రే ఉంటార‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రిలో ఎవ‌రికి చోటు ఇచ్చినా మ‌రొక‌రు అల‌క‌బూన‌డం ఖాయం. ఇది కూడా కేసీఆర్‌కు క‌త్తిమీద సాములాంటిదే. ఇక ఖ‌మ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సైతం ఇందులో ఉంటార‌ని తెలుస్తోంది.