ఫ్లాప్ ఫ్లాప్ కలిస్తే హిట్ వస్తుందా?

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి టాప్ హీరోలలో ఒకడిగా పేరుతెచ్చికున్న రవితేజ ఈ మధ్య సరైన హిట్ లేక బాగా డీలా పడ్డారు.రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్షన్,కామెడీ,మాస్ అనే అంశాలతో రవితేజని జనాలు మాస్ మహారాజ్ ని చేశారు.అయితే రవితేజ నవతరం హీరోల ఎంట్రీతో రేసులో కొంచెం వెనక పడ్డారు.

బెంగాల్ టైగర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఇంతరకు ఇంకో చిత్రం విడుదల కాలేదు.దీనికి కారణం కూడా ఉంది.రవితేజ సినిమాలన్నీ మరీ రొటీన్ గా ఉంటున్నాయని ఒక రూమర్ వచ్చేసింది.దాన్ని పోగొట్టే పనిలో పడ్డాడు మన రవి.చక్రి అనే కొత్త దర్శకుడితో రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా అవకాశాల్లేని ప్లాప్ డైరెక్టర్స్ తో మళ్ళీ పనిచేసేందుకు రవితేజ ఆసక్తి చూపుతున్నాడు.సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి అంగీకరించాడు మాస్ మహరాజ. తనకు పవర్ లాంటి హిట్ సినిమా అందించిన బాబీతో మరొక సారి కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇదేకాకుండా రవితేజ కెరీర్లో అతిపెద్ద ప్లాప్ “వీర” సినిమానిచ్చిన డైరెక్టర్ రమేష్ వర్మకు కూడా రవితేజ మరో చాన్స్ ఇస్తున్నాడని టాక్.ఏమో ప్లాప్ డైరెక్టర్స్ తో రవితేజ కలిస్తే మంచి కసితో సినిమా తీసి హిట్ కొడతారేమో వేచి చూడాల్సిందే.