బక్కచిక్కిన బ్యూటీ ని గుర్తుపట్టారా?

ఇలియానాది చూడ చక్కని అందం. కుర్రాళ్ల మనసుల్ని దోచుకునేంత సొగసరి. తాను కనిపిస్తే అభిమానులు ఊహాలోకాల్లో విహారిస్తుంటారు. మరి తన గ్లామర్ తో అంతగా ఆకట్టుకున్న ఈ అందాల సుందరి ఇప్పుడు బక్క చిక్కి ఒళ్ళు పీక్కుపోయి.. అంద విహీనంగా కనిపిస్తోంది. అసలు తాను రివీల్‌ చేసిన ఫోటోలను చూస్తే ఈ అమ్మడు ఇలియానానేనా అనే డౌట్‌ రాక మానదు.

అక్షయ్‌ కుమార్ తో చేస్తోన్న రుస్తుం సినిమా కోసం ఇల్లి బేబి చాలా హార్డ్‌ వర్క్ చేసినట్టు కనిపిస్తోంది. 1950 సంవత్సర కాలం నాటి గెటప్‌లో కనిపించేందేకు శరీరాకృతిని పూర్తిగా మార్చేసుకుంది. కాస్ట్యూమ్‌ విషయంలోను పూర్తి దృష్టి సారించింది ఈ గోవా భామ. తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రాం లో ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది ఇలియానా.

కొత్త సినిమాలో నా లుక్ ఎలా ఉంటుందో అందరికి చెబుతానని, కొన్ని పిచ్చి ఫోటోలను కూడా అందరికి షేర్ చేస్తానని ట్వీట్ చేసింది.  డైరెక్టర్ ఆవిష్కరించిన పాత్ర ద్వారా తమలోని టాలెంట్‌ని బయట పెట్టేందుకు వారి రూపు రేఖలను మార్చుకునేందుకు కూడా రెడీ అవుతోంది గోవా బేబీ.