బలపరీక్ష వెనుక పళని స్వామి `హైబడ్జెట్` మూవీ

త‌మిళ‌నాట ఎన్నో రాజ‌కీయ ప‌రిణామాల త‌ర్వాత కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. చిన్న‌మ్మ న‌మ్మినబంటు ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో విజ‌య‌వంతంగా గ‌ట్టెక్కారు. ఎమ్మెల్యేలు అంతా చేజారిపోర‌నే ధీమా.. అంతా త‌న‌కే మద్దతు ఇస్తార‌నే ఆత్మ‌విశ్వాసం ఆయ‌న‌లో తొలి నుంచి మెండుగా ఉన్నాయి. అయితే దీని వెనుక చాలా `హైబ‌డ్జెట్‌` క‌థే న‌డించింద‌ని స‌మాచారం. గెలుపు కోసం.. అంత‌కుమంచి సీఎం కుర్చీని ద‌క్కించుకునేందుకు చేతి చ‌మురు బాగానే వ‌దుల్చు కున్నార‌ట‌. ఎన్నిక‌ల్లో ఖర్చు పెట్టే దాని కంటే.. `అంతకు మంచి` ఖ‌ర్చుచేశార‌ట‌. ఎమ్మెల్యేలు త‌న‌ చేజారిపోకుండా ఉండేందుకు ప‌ళ‌ని స్వామి ఖ‌ర్చుచేసిన మొత్తం ఎంతో తెలుసా అక్ష‌రాలా ఏడు వంద‌ల కోట్లు!!

ఆశ్చ‌ర్యంగా ఉందా! త‌ప్పుదు మ‌రి!! ఆ మాత్రం ఖ‌ర్చుచేయ‌క‌పోతే ఎలా? రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఒక‌వైపు ప‌న్నీర్ సెల్వం సీఎం కావాల‌ని కోరుకున్నారు. మరోవైపు రోజులు గ‌డుస్తున్న కొద్దీ ఎంత‌మంది తన‌వైపు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి! మ‌రి  జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య జైల్లోకి వెళ్లాల్సి రావ‌డంతో.. ఒక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప‌న్నీర్ గూటికి చేరిపోవ‌చ్చ‌ని అంతా అనుకున్నారు. ప‌న్నీర్ కూడా ఇదే ధీమాతో ఉన్నారు. కానీ అనూహ్యంగా బ‌ల‌ప‌రీక్ష‌లో చుక్కెదురైంది. కేవ‌లం 11 మంది త‌ప్ప మిగిలిన వారంతా ప‌ళ‌నిస్వామికే జై కొట్టారు.

బలపరీక్షలో గెలిచేందుకు అవ‌స‌ర‌మైన ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు వారికి అన్ని స‌క‌ల‌ సౌకర్యాలు కల్పించార‌ట‌. పళనిస్వామి క్యాంపులో దాదాపు 120 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ సొంత క్యాంపులో అసమ్మతి రాకుండా … పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారట. ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్లు ఆఫర్ చేశారట. అందులో సగం డబ్బు అప్పటికే ఎమ్మెల్యేల ఇళ్లకు కూడా చేరిపోయిందట. ఒక్కో ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు నిర్ణయించినా.. కొంతమంది అసంతృప్తులకు 10 కోట్ల దాకా ఇచ్చార‌ట‌.

రెబల్ ఎమ్మెల్యేలకు కూడా అప్పుడే డ‌బ్బులు  ఇచ్చారట. డబ్బులు ఆశతోనైనా ఆ ఎమ్మెల్యేలు దారిలోకి వస్తారని పళని ఆశ. ఇలా మొత్తం హాలీవుడ్ సినిమా రేంజ్ బ‌డ్జెట్.. రూ. 700 కోట్ల ట్ తో పళనిస్వామి రంగంలోకి దిగాడు. మ‌రి డ‌బ్బుకు లోకం దాసోహం అనేది తెలిసిన విష‌య‌మే! అందుకే ఎమ్మెల్యేలంగా ప‌ళ‌నిస్వామికే ఓటేశారు. దీంతో ప‌ళ‌ని స్వామి సినిమా సూప‌ర్ హిట్ అయింది. ప‌న్నీర్ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయింది.