బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం బోధపడినట్టుంది.

ఒక్కో రైతుకు లక్ష‌న్న‌ర రుణ విముక్తి చేయడం మామూలు విష‌యం కాదట,మరి హామీ ఇచ్చినప్పుడు ఈ విషయం బాబు గారు ఎందుకుమారిచారో మరి! ఒంగోలులో రెండో విడత రుణ ఉప‌శ‌మ‌న ప‌త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రుణ విముక్తి చేసేందుకే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని, తమ ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేయ‌ట్లేదంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రం కూడా రుణాలు మాఫీ చేయ‌లేదని, తాము లోటు బ‌డ్జెట్‌లో ఉన్న‌ప్ప‌టికీ రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. అయినప్ప‌టికీ ప్ర‌తిప‌క్షాలు రుణ‌మాఫీపై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయ‌న అన్నారు. రుణమాఫీ పై అనవసర రాద్ధాంతం అనగానే ఇదెక్కడి చోద్యం అనుకున్నారు పాపం వచ్చిన సామాన్యులు.బాబు ఇంకో అడుగు ముందుకేసి అసలు ఒక‌ప్పుడు వైఎస్‌, ఇప్పుడు జ‌గ‌న్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని పనిలో పనిగా వాళ్లపై ఒక రాయి విసిరేశారు.

అంతేనా రాజధాని, పట్టిసీమను అడ్డుకునేందుకు కుట్రచేశారని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని ఉద్ఘాటించారు.ఈ అనుసంధానం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఇది పెద్ద హాస్యాస్పదం.పట్టిసీమ తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు చెందకుండా రాజధాని అవసరాలకు వినియోగిస్తూ అనుసంధానం, రాయసీమ అభివృద్ధి అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేశారు బాబు గారు.

పాపం ఆయనొక్కడే కష్టపడిపోతున్నట్టు ‘నేనొక్కడినే కష్టపడితే అభివృద్ధి సాధ్యం కాదు.. అంద‌రూ క‌ల‌సి రావాలి అని పిలుపునిచ్చేసారు. రైతులగురించయితే పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు.రైతు నేల త‌ల్లినే న‌మ్ముకుంటాడు. ఎన్ని క‌ష్టాలు ప‌డ్డా మ‌న‌కు అన్నాన్ని పెడ‌తాడు.. అలాంటి రైతు సంక్షేమాన్ని మేము మ‌ర‌వ‌బోం’ అని రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదూ!!

ఇక గోదావరి కృష్ణ అనుసంధానం అయిపోయిందట ఇక రాబోయే రోజుల్లో కృష్ణా, సోమశిల న‌దుల‌ను అనుసంధానం చేస్తామ‌ని ప్రకటించేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే రైతుల క‌ష్టాల‌న్నీ తీరుతాయని ఈయన కొత్తగా సెలవివ్వటం ఈ స్ప్చ్ కె హై లైట్.‘నా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు, అప్పు చేయాలంటే భార‌త ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు. ఎన్ని క‌ష్టాలున్నా రైతు రుణ‌మాఫీ విష‌యంలో వెన‌క్కిత‌గ్గ‌లేదు’ అని పడిన పాటే మళ్ళీ పాడి వినిపించారు.