బాలయ్య పూరి కాంబినేషన్ అంతా క్రేజీ గానే!

నందమూరి బాలకృష్ణ NBK 101 రెండు రోజులు కిందటే అట్టహాసంగ ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరో గోపీచంద్ కి హిట్స్ ఇచ్చిన భవ్య క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా గురించి బాలయ్య నాది పూరీది ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసాడు ప్రారంభంరోజేనే. పూరి బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులికి కొంచం కొత్తగా మరి కొంచం నెర్వేస్ ఉంటది, అది అలా ఉంటె ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ చెక్కర్లుకొడుతుంది, అది ఏంటంటే బాలయ్యకు ఈ సినిమా చేస్తునందుకు బారి రెమ్యూనరేషన్ ఇస్తుందిటఆ నిర్మాణ సంస్థ. ఆ మేజిక్ ఫిగర్ ఎంతంటే రూ 10 కోట్లు, బాలయ్య 100 సినిమా  శాతకర్ణికి 5  నుంచి  7  కోట్లు తీసుకున్నాడు అని సమాచారం ఆ సినిమా బ్లాక్బస్టర్ అయి 80  కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు పూరి సినిమాకి 10 కోట్లు ఇస్తాకి సిద్ధం అయ్యారట.

ఈ సినిమాకి పూర్తి బడ్జెట్ రూ 35 కోట్లతో నిర్మించాలని నిర్మాతలు అనుకోంటున్నారట, బాలయ్యకు రెమ్యూనిరేషన్ పోగా మిగతా రూ 25  కోట్లతో మిగిలిన తారాగణానికి మరియు పూరికి, నిర్మాణానికి ఉపయోగించాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాకి కొసమెరుపు ఏమిటంటే హీరోయిన్ తో పాటు సైడ్ ఆర్టిస్టుల్ని అందరిని కొత్తవారిని తీసుకుందామని ప్లాన్లో ఉన్నాడంట దర్శకుడు పూరి.

నిర్మాణ సమస్త అయిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమా పై పక్క ప్లాన్తో ముందికి వెళ్తుందట, తాము అనుకున్నట్టు సినిమా పూర్తి చేస్తే రూ 15 కోట్లు ఆర్జించటం పెద్ద కష్టం కాదట, థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 40 కోట్లు, ఆడియో/వీడియో రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుని రూ. 12 కోట్లు వచ్చే అవకాశం ఉందని నిర్మాత లెక్కలు అప్పుడే వేసేసుకున్నారట.త్వరలో మనముందుకు రానున్న ఈ క్రేజీ కాంబినేషన్ గురుంచి చెక్కర్లు కొడ్తున్న తాజా సమాచారం ఇదే..