బాలయ్య..పూరి సినిమాలో విలన్ గా కుర్ర హీరో

బాలయ్య పూరి ఏ ముహర్తనా సినిమా మొదలు పెట్టారో గాని అన్ని విచిత్రం గాను మరియు సెన్సేషన్ మీనింగ్ లా అనిపిస్తున్నాయి. అసలు బాలయ్య పూరి కంబినేషనే హైలైట్ అనుకుంటే ఈ సినిమాలో దానికి మించిన హైలైట్స్ కి పూరి ఆద్యం పోస్తున్నాడు. ఇప్పటికే అనూప్ రూబెన్స్ లాంటి యువ సంగీత దర్శకుడిని తీసుకొని జనాల ముక్కుమీద వేలు పెట్టుకొనేలా చేసాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా బాలయ్యకు ప్రతినాయకుడిగా ఓ కుర్ర హీరోని తీసుకొని పెద్ద ఛాలెంజ్ చేస్తున్నాడు.

అసలు బాలయ్యకు ప్రతినాయకుడు అంటే ఎలావుండాలి పవర్ ఫుల్ డైలాగులతో డీ అంటే డీ అనే ఎమోషన్స్ తో పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ తో రెచ్చిపోవాలి. కానీ పూరి ప్రేక్షకుల అంచనాలిని తల క్రిందుల చేస్తూ ఓ కుర్ర హీరోని తీసుకున్నాడు. ఆ కుర్ర హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ కి బావ అయిన సుధీర్ బాబు, వినటానికే కొత్తగా ఉన్న ఇది నిజం. అయితే బాలయ్య సినిమాలని తాను చిన్నప్పుడు మరియు కాలేజ్ రోజుల్లో బ్లాక్ లో కొని మరి సినిమాలు చూసే వాడినని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు, ఇప్పుడు బాలయ్య ముందు కాలరేగారేస్తూ డైలాగ్ లు చెప్పటం తనకి కష్టం అని చెప్పినా నేను ఉన్నా నీ వెనక అంటూ పూరి బరోసా ఇచ్చాడట.. మరి పూరి సుధీర్తో ఏ మాత్రం విలనిజం చూపిస్తాడో చూద్దాం.