బాలయ్య మంచి మనసుకి ఫిదా అయిన క్రిష్

నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మొదలుపెట్టిన వదిలిపెట్టడు అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100 వ చిత్రమయిన గౌతమి పుత్ర శాతకర్ణి కి తానే స్వయంగా బ్రేక్ వేశాడు.గౌతమి పుత్ర శాతకర్ణి ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది అప్పుడే 50 శాతం వరకు షూటింగ్ పూర్తిఅయినట్టు సమాచారం. ఇంతటి వేగంగా సాగుతున్న షూటింగ్ కి స్వయానా బాలయ్యే బ్రేక్ వేశాడు కానీ అది తనకోసం కాదు డైరెక్టర్ క్రిష్ కోసం.

అవును ఆగస్ట్ 8 వ తేదీ న క్రిష్ వివాహం జరగనుంది కాగా క్రిష్ వివాహం కోసం ఒక నెల రోజుల పాటు షూటింగ్ కి సెలవు తీసుకోమని బాలకృష్ణే స్వయం గా చెప్పారట ఇది విన్న క్రిష్ బాలకృష్ణ పెద్ద మనసుకి ఫిదా అయిపోయాడట.

ఒకటి రెండు రోజుల్లో గౌతమి పుత్ర శాతకర్ణి టీం జార్జియా నుండి ఇండియా కి రానున్నదట. తిరిగి మళ్ళీ ఆగస్ట్ 3 వ వారం లో షూటింగ్ ప్రారంభం కానుంది.