బాలయ్య 101:”రైతు” కన్ఫామ్డ్ గా

నందమూరి నటసింహం బాలకృష్ణ 101 వ సినిమా ప్రకటన వెలువడింది.ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 100 వ సినిమాగా గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుమ్,కంచె వంటి ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీ గా వున్నారు బాలకృష్ణ.ఈ మధ్యనే క్రిష్ నిశ్చితార్థ వేడుకకి కూడా హాజరై వాడు వరులను ఆశీర్వదించారు.

కాగా హిందూపురం ఎమ్మెల్కేగా కొనసాగుతున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తన 101 వ సినిమా విశేషాలను వెల్లడించారు.ఎప్పటినుండో దీనిపై పుకార్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన ఇంతవరకు వెల్లడి కాలేదు.దీనిపై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చేసారు .తన 101 వ చిత్రం “రైతు” అని దానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్నాడని బాలకృష్ణ వెల్లడించారు.

ఇప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణి పై అభిమానులు అంచనాలు తారా స్థాయిలో వున్నాయి.ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ సంక్రాంతి సినిమా అంటే అభిమానులకి పెద్ద పండగే. ఇంతలోనే 101 వ చిత్రం విషేషాలు స్వయంగా బాలకృష్ణ ప్రకటించడం తో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.