బాలీవుడ్ లో బాలయ్య విశ్వరూపం

బాలయ్య సినిమాలకి బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకో దగ్గ మార్కెట్ లేదు .బాహుబలిని మినహాయిస్తే బాలీవుడ్ లెవెల్లో ఓ స్థానిక సినిమా పోటీ పడగలదా? బాలీవుడ్‌లో స్ట్రైట్‌గా వచ్చిన ఓ టాప్ హీరో సినిమాను ఓ డబ్బింగ్ బొమ్మ ఢీకొనగలదా? ఢీ కొట్టి నిలబడగలదా? అందునా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, హృతిక్ రోషన్ వంటి స్టార్లను ఎదుర్కోగలదా? దానికి చాలా మంది నుంచి వచ్చే సమాధానం దాదాపు అసాధ్యం అనే. కానీ,అయ్యినపుడుకి గత సంక్రాంతి కి రిలీజ్ అయ్యిన డిక్టేటర్ సినిమా పోటీ పడింది . ఓ తెలుగు సినిమా దానిని సుసాధ్యం చేసింది. అంతేకాదు వారి సినిమాలను తోసిరాజని టాప్‌ రేటింగ్ సాధించేసింది. అయితే అది వెండితెర మీద కాదు.. బుల్లితెరపై అది సాధ్యమైంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాలీవుడ్ టాప్ హీరోలను వెనక్కు నెట్టేశాడు. విషయమేంటంటే.. రీసెంట్‌గా వచ్చిన హృతిక్ రోషన్ సినిమా మొహెంజోదారోను వరల్డ్ ప్రీమియర్ షోగా స్టార్ గోల్డ్‌లో ఈ నెల 9న ప్రసారం చేశారు. రూరల్ ఏరియాల్లో ఆ సినిమాకు 1511 రేటింగ్ వచ్చింది. అయితే అంతకుముందు రోజు ‘యుద్ధ్ ఏక్ జంగ్’గా హిందీలో డబ్ చేసి బాలయ్య డిక్టేటర్ సినిమాను రిష్తే సినీప్లెక్స్‌లో ప్రసారం చేశారు. ఆ సినిమాకు రూరల్ ఏరియాల్లో 1649 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన హృతిక్ స్ట్రైట్ సినిమా కన్నా బాలయ్య డబ్బింగ్ బొమ్మకే రేటింగ్ వచ్చింది. అంటే ఆ సినిమాను అక్కడి ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.

 అంతేకాదు.. బాలయ్య సినిమాకు అంతలా రేటింగ్ రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేగాకుండా ఆ వారంలో టాప్ రేటింగ్‌లో నిలిచిన సినిమా కూడా అదే. ఆ వివరాలకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ లిస్ట్‌లో గోపీచంద్ జిల్ సినిమా నాలుగో స్థానంలో ఉంది. మరి ఈ ఫొటో చూసిన బాలయ్య అభిమానులు.. అదీ బాలయ్య పవరంటే అని తెగ సంబరపడుతు కాలర్ ఎగరేస్తున్నారు .