బీజేపీతో టచ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే … కెసిఆర్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట.

టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి గళం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇప్పుడిప్పుడే అసంతృప్తి సెగ‌లు త‌గులుతున్నాయి. కొంత కాలం నుంచీ మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్.. ఇప్పుడు ఆ ఆశ‌లు గ‌ల్లంత‌వ‌డంతో ఇప్పుడు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఉద్య‌మ కారుల‌కు పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్న అభిప్రాయం కొంత‌కాలం నుంచీ టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. ఇప్పుడు ఇది వాస్త‌వమేన‌నే అభిప్రాయంతో శ్రీ‌నివాస్ గౌడ్ ఉన్నార‌ట‌. ఇక పార్టీలో ఉండ‌టం అన‌వ‌స‌ర‌మ‌నే భావ‌న ఆయ‌న‌లో నిండిపోయింద‌ట‌. దీంతో ఇక పార్టీని వీడే ఆలోచ‌న‌లోనూ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

టీఎన్‌జీవోలో శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క పాత్ర పోషించారు. చైర్మ‌న్ కోదండ‌రాం త‌ర్వాత‌.. ఆయ‌నే ముఖ్య నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. అనంత‌రం టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఆ స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చార‌ట‌. ఆ హామీతోనే ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి రాద‌ని డిసైడ్ అయిపోయార‌ట‌. ముఖ్యంగా ఎంపీ జితేంద్ర రెడ్డి త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా అడ్డుప‌డుతున్నార‌ని భావిస్తున్నార‌ట‌.

అలాగే కొంత‌కాలం నుంచి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చ‌ర్చ మొద‌లైంది. ఈ స‌మ‌యంలో శ్రీ‌నివాస్ గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ త‌రుణంలో ఆయ‌న పేరు కూడా తెర‌పైకి వ‌స్తోంది. అయితే ఈసారి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ద‌ని ఆయ‌న డిసైడ్ అయిపోయార‌ట‌. అలాగే టీఆర్ఎస్ ఉద్య‌మంలో కీల‌కంగా మారిన‌.. నేత‌ల‌కు టీఆర్ఎస్లో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అలాగే త‌న‌కు మంత్రిప‌ద‌వి రాకుండా.. కొంత‌మంది అడ్డుప‌డుతున్నార‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నార‌ట‌.

ఈ మేర‌కు ఆయ‌న స‌న్నిహితుల‌తో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ముఖ్యంగా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేర‌వ‌చ్చ‌ని వాద‌న వినిపిస్తోంది. బీజేపీతో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలున్న త‌రుణంలో ఆయ‌న  బీజేపీ వైపే మొగ్గు చూప‌వ‌చ్చని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచిచూడాల్సిందే!!