‘బ్రాట్’ కోరిక కాదనలేక పోయిన చరణ్

సెలబ్రిటీల్లో చాలామంది పెట్స్‌ను ఇష్టపడుతుంటారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజులో కొద్దిసేపు పెంపుడు జంతువులతో గడుపుతుంటారు. ఈ లిస్ట్‌లో మన మెగా హీరో రామ్‌ చరణ్‌ కూడా ఉన్నారు. ఆయన వద్ద ‘బ్రాట్’ అనే విదేశీ జాతికి చెందిన కుక్కపిల్ల ఉంది. ఈ పప్పీని శ్రీమతి ఉపాసన నుంచి బాహుమతిగా పొందారు. ఈ కుక్కపిల్ల చాలా ఇంటెలిజెంట్. యాక్టివ్. అదంటే ‘మగధీర’ చరణ్ కి ప్రాణం.

చరణ్ ఎక్కడికి వెళుతున్నా … తానూ వచ్చేస్తానంటూ ‘బ్రాట్’ కూడా రెడీ అవుతుందట. అలా రాత్రి ఆయన ‘ధ్రువ’ షూటింగ్ కి వెళుతుంటే, అది కూడా కారెక్కేసింది. ‘బ్రాట్’ కోరిక కాదనలేక చరణ్ దానినీ షూటింగుకి తీసుకొచ్చినట్లు ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. రాత్రంతా తన షూటింగ్ చూస్తూ అది నిద్ర పోలేదని తెలిపారు. ‘బ్రాట్’ తోడుగా షూటింగులో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు.