బ్రేకప్ తర్వాత ఓ రేంజ్ లో ఎంజాయ్!

పాకిస్తాన్ మూలాలున్న అమెరికన్ నర్గీస్ ఫక్రి. సినిమాల్లో కంటే ఎఫైర్లు, గ్లామర్ షోతోనే వార్తల్లో ఎక్కువగా నానింది ఈ బ్యూటీ. ఉదయ్ చోప్రాతో డేటింగ్, బ్రేకప్ లతో టాకాఫ్ ది టౌన్ గా మారింది. ఇటీవలే హౌజ్ ఫుల్ -3లో సందడి చేసిన ఈ భామ తనకు తగిన గుర్తింపు లేదనుకుంటుందో ఏమో గానీ బాలీవుడ్ కు బై చెప్పేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. ఆమె పూర్తిగా అమెరికాకే పరిమితం కానుందని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ఉదయ్ తో బ్రేకప్ తర్వాత నర్గీస్ ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ప్రస్తుతం గ్రీస్ టూర్ లో ఉన్న అమ్మడు అక్కడి బీచ్ ల్లో ఎంజాయ్ చేస్తూ బికినీల్లో ఉన్న ఫొటోలను కసిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మాజీ లవర్ పై కోపంతోనే కాక.. బ్రేకప్ తర్వాత తన లైఫ్ స్టైల్ లో మార్పులేవీ లేవని చెప్పడానికే ఇలా చేస్తోందని బాలీవుడ్ లో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.