మజ్ను TJ రివ్యూ

సినిమా : మజ్ను
టాగ్ లైన్ : అమర ప్రేమ కాదు అస్తవ్యస్త ప్రేమ
రేటింగ్ : 3/5
నటీనటులు : నేచురల్ స్టార్ నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి.
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్.
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.
నిర్మాత : గీత గొల్ల , P. కిరణ్.
బ్యానర్ ; ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవ మూవీస్.
సంగీతం : గోపి సుందర్.
స్క్రీన్ ప్లే,కథ,దర్శకత్వం : విరించి వర్మ

భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,జెంటిల్మెన్ లతో హ్యాట్రిక్ హిట్ కొట్టి కెరీర్ పీక్ లో ఉన్న నాని మజ్ను అనే సూపర్ హిట్ టైటిల్ తో,సాంగ్స్, టీజర్, ప్రోమోలతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించి రిలీజ్ కు ముందే మంచి హైప్ క్రియేట్ చెయ్యడం లో సక్సెస్ అయ్యాడు.ఇక ఉయ్యాల జంపాల లాంటి స్వీట్ అండ్ సింపుల్ లవ్ స్టోరీ తో హిట్ కొట్టిన విరించి వర్మతో నాని యూత్ ఫుల్ గా,సేఫ్ గా మజ్ను ట్రై చేశారని చెప్పొచ్చు.

సినిమా ఆద్యంతా బాగుంది ..పర్లేదు మధ్య ఊగిసలాడుతున్నట్టే ఉంటుంది తప్ప అబ్బా భలే ఉందే అని మాత్రం అనిపించదు.దానికి ముక్యంగా వేలెత్తి చూపాల్సింది స్క్రీన్ ప్లే ని.స్క్రీన్ నిండా ఆహ్లాద కరమైన,అందమైన ప్రేమ సన్నివేశాలు వున్నప్పుడు దానికి తగ్గ స్క్రీన్ ప్లే లేకపోతే అవి ఎంత అందంగా చిత్రీకరించినా ప్రేక్షకుల్ని కథలో ఇన్వొల్వె చేసేది మాత్రం స్క్రీన్ ప్లే నే.అది గ్రిప్పింగ్ గా ఉండుంటే మజ్ను వేరే హైట్స్ కి వెళ్ళుండేది.

ఓ స్వచ్ఛమైన ప్రేమ జంట అనుమానం తో మరో స్వచ్ఛమైన స్నేహాన్ని శంకించి విడిపోతే..ఆ సంఘర్షణలో మజ్ను మరో ఆకర్షణని ప్రేమనుకుని భ్రమపడి తెలుసుకుని తప్పు సరిదిద్దుకునే ప్రయాణం లో జరిగే మలుపులు ఈ మజ్ను.స్టోరీ సింపుల్.చాలా సినిమాల్లో చూసాం.అయితే విరించి వర్మ భీమవరం లో లవ్ ట్రాక్ ని కాలేజీ లో డీల్ చేసిన విధానం బాగుంది.హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది.ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి ఫీల్ తో నడిపించిన దర్శకుడికి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది సినిమా..దీనికి కొన్ని మలుపులు,ట్విస్టులు వుండాలని గుర్తొచ్చినట్టనిపిస్తుంది. అందుకే సెకండ్ హాఫ్ లో కథను ఎటు తీసుకెళ్లాలో ఎక్కడ ముగించాలో తెలియక చాలా తెలుగు సినిమాల్లో మాదిరిగానే ముగించేశాడు.

నేచురల్ స్టార్ నాని ప్రతి ఫ్రేమ్ లో తనెంత మెచ్యూర్ నటుడో మరో సారి చూపించాడు.నాని కామెడీ టైమింగ్ సింప్లి సూపర్బ్. హీరోయిన్స్ ఇద్దరి నటన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది.హీరో ఫ్రెండ్ గా నటించిన సత్య ,నాని మధ్య చిన్న చిన్న కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.వెన్నెలకిషోర్ ఎపిసోడ్ బాగుంది.రాజ్ తరుణ్ గెస్ట్ రోల్ లో మెరిశాడు.రాజమౌళి స్పెషల్   అప్పీరెన్స్ తో నాని అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. మిగిలిన వారిలో పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలేవీ లేదు.

విరించి వర్మ డైరెక్షన్ బాగుంది.స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా వుండాల్సింది.మ్యూజిక్ బాగుంది. పాటలు సిట్యుయేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైలాగ్స్ సింపుల్ గా ఉన్నా ఎఫెక్టివ్ గా వున్నాయి. హీరో హీరోయిన్ కు రాసే ప్రేమ లేఖ అద్భుతంగా రాశారు. అందుకనే సినిమాలో దాన్ని ఒకటికి రేడు సార్లు చదివి వినిపిస్తారు.

ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మజ్ను ఓ మాములు సినిమాని చేసింది స్క్రీన్ ప్లే. అయినా సినిమా ని కాపాడింది మాత్రం నాని నటన,సిట్యుయేషనల్ కామెడీ,ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ డీల్ చేసిన విధానం.నాని వెళ్తున్న ట్రాక్ మెచ్చుకోవాల్సిందే..యూత్ ఫుల్ సినిమాలు..అందులోను కామెడీ మిస్ అవ్వకుండా కొంచెం కొత్తదనం..ఇంకొంచెం సినిమాటిక్ ఫార్ములా ను కలిపి వరుస హిట్లు కొట్టేస్తున్నాడు నాని.