మామ కాబోతున్న స్టార్ హీరో

తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో విక్రమ్ త్వరలో మామగారు కాబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్రమ్ సన్నిహితులు తెలిపారు. చెన్నైలోని చాలా ఫేమస్ అయిన సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుమారుడు మను రంజిత్ ను అక్షిత పెళ్లాడనుంది.

అక్షిత-రంజిత్ ఎంగేజ్ మెంట్ కోసం విక్రమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జూలై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో వీళ్లిద్దరి నిశ్చితార్ధం జరగనుంది. విక్రమ్ కు చాలా దగ్గరి బంధువులను మాత్రమే వేడుకకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది జరిపే అవకాశాలున్నాయి. ఐతే అక్షితది లవ్ మ్యారేజా.. లేక అరేంజ్డ్ మ్యారేజా అన్నది మాత్రం తెలియలేదు.

ప్రస్తుతం విక్రమ్ కరికాలన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అవుతోంది. మరో మూవీ ఇరుమురుగన్ సెప్టెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక భారీ బడ్జెట్ తో వస్తొన్న గరుడ మూవీ వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.