ముద్రగడ మొత్తానికి మొండోడే!!

ముద్రగడ ఎపిసోడ్-1 కి 2 కి తత్త్వం బోధపదినట్టుంది.మొదటి సారి దీక్షలో తు తు మంత్రంగా దీక్ష చేసి ప్రభుత్వ దూతలు రాగానే చర్చలు అని కాలక్షేపం చేసి జ్యూస్ తాగేసి దీక్ష విరమించెసి అభాసు పాలయ్యారు.ఈ సారి అలా కనిపించడం లేదు కాస్తా మొండిగానే వున్నట్టు కనిపిస్తోంది దీక్ష. తుని దుర్ఘటనలో ఆందోళనకారులపై సిఐడి పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించడంతోపాటు ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలుగా గుర్తిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు నిరాహార దీక్ష కొనసాగించాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ముద్రగడతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా లేనని కూడా ఆయన స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం మొండిగా వ్యవహరించిన పక్షంలో తాను అంతకంటే మొండిగా దీక్ష కొనసాగిస్తానని, చివరకు తన శవాన్ని చూడాల్సి వస్తుందని కూడా ముద్రగడ హెచ్చరిస్తున్నట్టు కిర్లంపూడికి చెందిన ముద్రగడ సన్నిహితులు చెబుతున్నారు. మంజునాథన్ కమీషన్ నివేదిక ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి అందేలా చేసి, ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలలో చేరుస్తామని ప్రభుత్వం అప్పట్లో ముద్రగడకు ఇచ్చిన హామీ . ఇక ఇప్పుడు ముద్రగడ పాత హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు తేదీ ఆగస్టులోగా కాపులను బిసిలలో చేరుస్తామంటూ అధికారికంగా హామీ ఇవ్వాలని, ఆందోళకారులపై పెట్టిన కేసులన్నిటినీ బేషరతుగా రద్దు చేయాలని, అలాగైతైనే దీక్ష విరమించాలని ముద్రగడ తెగిసి చెప్పేశారు. అలాగే జైలులో ఉన్న 13మందిని విడుదల చేయాలని, ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేయాలని కూడా ముద్రగడ పట్టుబట్టారు.

అయినా ముద్రగడ ఎప్పుడు ఎలా స్పందిస్తాడో ఎవ్వరికి అంతుపట్టదు.అప్పుడే మౌనం గా వున్న్ట్టుంటాడు అంతలోనే దీక్ష అంటాడు,మళ్లీ విరమిస్తాడు,ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళతాడు అక్కడ గాలికి వదిలేస్తాడు ఇలా ఈయన వ్యవహార శైలే ఎవ్వరికి అర్థం కాదు.చూద్దాం ఈ సారి ఎలాంటి షాక్ లు ఇవ్వబోతున్నడో ముద్రగడ.