మెగా మంచు ఆత్మీయత అదుర్స్

తెలుగు చిత్రసీమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక స్నేహితుల జంట కాస్త విచిత్రంగా ఉంటుంది. అసంతృప్తులేవైనా ఉంటే బహిరంగంగానే ప్రదర్శిస్తుంటారు. అంతకు మించి ఆత్మీయంగా మసలుకుంటారు. ఈ చిత్రమైన జోడి మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది. వీరిద్దరి బంధాన్ని ‘టామ్ అండ్ జెర్రీ’లతో కొందరు సరదాగా పోల్చుతుంటారు కూడా. ఈ సంగతెలా ఉన్నా… వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ క్లోజ్‌గానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ వీరు ఆత్మీయుల్లా కలిసిపోయి సందడి చేస్తారు.

వీరి స్నేహబంధాన్ని తాజాగా మంచు లక్ష్మి సోషల్‌మీడియాలో షేర్‌ చేసుకుంది. భర్త ఆండీ శ్రీనివాస్‌, రామ్ చరణ్-ఉపాసనలతో పాటూ మరికొంతమంది బంధువులతో కలిసి వెళ్లిన ఓ విదేశీ టూర్ తాలూకు చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు మెగా-మంచు వారి అభిమానులనే కాక అందరినీ ఆకట్టుకుంటున్నాయి.