మెరుపుతీగ బొద్దుగుమ్మలా మారుతోంది

నాజూకైన అందం ముద్దుగుమ్మ శ్రియది. వయసు పెరిగినా కానీ తన దేహాకృతిలో ఏ మాత్రం మార్పు రాకుండా మెయింటైన్‌ చేస్తోంది శ్రియ. అటువంటి మెరుపుతీగ శ్రియ ఇప్పుడు బొద్దుగుమ్మలా మారబోతోంది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలో బాలయ్య పక్కన జోడీ కోసమట. బొద్దుగా అంటే మరీ ఎక్కువగా కాకుండా, జీరోసైజ్‌ నుంచి కాస్త కండ పట్టేలా శ్రియ తన శరీరాన్ని మార్చుకోనుంది దర్శకుడి సూచన మేరకు శ్రియ ఈ ప్రయత్నం చేస్తోందట. ఈ మధ్య మరీ సన్నగా జీరో సైజుకు మారిపోయిన శ్రియ, ఇప్పుడు ఈ సినిమా కోసం కొంచెం కండ పెంచడంతో మరింత ముద్దుగా అందంగా కనిపించబోతోంది. ఈ సినిమాలో మధ్య వయస్కురాలైన స్త్రీగా కనిపించనున్న శ్రియ అందుకు తగ్గట్టుగా తన దేహాకృతిని మార్చుకోవడం తప్పని సరి అవుతోంది. శాతకర్ణి భార్యగా ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో శ్రియ కూడా ఈ పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తున్నట్లు వినికిడి. బాలకృష్ణతో గతంలో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా చేసిన శ్రియ. ఆ సినిమాలో బబ్లీగాళ్‌గా నాజూకు అందాలతో కనువిందు చేసింది. మళ్లీ చాలా గ్యాప్‌ తర్వాత బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమాలో కొంచెం పెద్దతరహా పాత్రలో హుందాగా కనిపించడానికి రెఢీ అవుతోంది. నయనతారకు బాలకృష్ణతో చేసిన ‘శ్రీరామరాజ్యం’ సినిమా నటిగా మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే ఈ సినిమాతో శ్రియకు కూడా మంచి పేర రానుందని ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు.