మోడీకి మరో షాక్ :సిద్దు జంప్

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గ‌త ఏప్రిల్ నెల‌లో బీజేపీ తరపున రాజ్యస‌భ‌కు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేయడంతో ఆ స్థానాన్ని సిద్దూ వదులుకోవాల్సి వచ్చింది.

పంజాబ్ నుండి సిద్దు బీజేపీ లో ఉన్నంత కాలం శిరోమణి అకాళీదళ్ అడుగడునా అడ్డుపడింది.ఏకంగా బాదల్ తనుయుడే సిద్దు ను అడ్డుకున్నారు.పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ అభివృద్ధి జరగకుండా,బీజేపీ ఏడుగకుండా అడ్డుకున్నా బీజేపీ మాత్రం మిత్రపక్షాన్ని ఏమి అనలేక మౌనంగా ఉండిపోయింది.అంతే కాక సిద్దు ని కూడా ఈ విషయం లో మౌనంగా ఉండమని చెప్పడంతో ఈ డాషింగ్ ఓపెనర్ నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇంకోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధు భార్య కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు.అయితే వీరిద్దరూ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లో చేరనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.వచ్చే ఎన్నికల్లో ఆప్ సీఎం అబ్యర్థిగా సిద్దు నే నిలబెట్టే అవకాశాలున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.దీనికి తోడు పంజాబ్ ప్రజ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని సిద్ధు అనడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తుంది.

ఇప్పటికే ఉత్తరాఖండ్,అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలన విధించి తప్పుచేసి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవి చూసిన మోడీ సర్కార్ కి దగ్గర్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్,పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి.ఈ తరుణం లో సిద్దు రాజీనామా బీజేపీ ని బలహీన పరుస్తుందనడం లో సందేహం లేదు.అదే టైం లో ఆప్ లో సిద్దు చేరిక కేజ్రీవాల్ కి బలాన్నిస్తుంది.